Maayon review: రివ్యూ: మాయోన్
సిబి రాజ్ కీలక పాత్రలో నటించిన ‘మాయోన్’ఎలా ఉందంటే?
చిత్రం: మాయోన్; నటీనటులు: సిబి రాజ్, తాన్య రవిచంద్రన్, రాధా రవి, కె.ఎస్.రవికుమార్ తదితరులు; సంగీతం: ఇళయరాజా; సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్; ఎడిటింగ్: రామ్ పాండియన్, కొండలరావు; నిర్మాత: అరుణ్ మోళిమాణికమ్; దర్శకత్వం: ఎన్.కిషోర్; విడుదల: 07-07-2022
ఇతర భాషల్లో విడుదలైన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావటం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఇలా వచ్చిన చిత్రమే ‘మాయోన్’. సత్యరాజ్ తనయుడు సిబి రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ట్రైలర్, ప్రచార చిత్రాలతోనే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఈ ‘మాయోన్’ కథ (Maayon review) ఏంటి? సిబి రాజ్ ఎలా నటించారు?
కథేంటంటే: అర్జున్ (సిబి రాజ్) ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో శాస్త్రవేత్త. పాదరసంలా చురుకైన వ్యక్తి. ప్రాచీన వస్తువులను కాపాడటం ఎంతో ముఖ్యమని, అది మన పూర్వుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తోటి ఉద్యోగులతో చెబుతుంటాడు. కానీ, అతడే ఆ విలువైన విగ్రహాలను విదేశాలకు అమ్మేస్తుంటాడు. అందుకోసం విగ్రహాల స్మగ్లింగ్ మాఫియా మధ్యవర్తిగా పనిచేస్తున్న సీనియర్ ఆర్కియాలజీ ఆఫీసర్ దేవరాజ్ (హరీశ్ పేరడి)తో చేతులు కలుపుతాడు. ఈ క్రమంలో 5 వేల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన మాయోన్ ఆలయం, అందులోని నిధి గురించి వీరికి తెలుస్తుంది. దీంతో అర్జున్, దేవరాజ్ ఆ ఆలయానికి వెళ్లి నిధి వేట మొదలు పెడతారు. మరి వీళ్లకు ఆ నిధి రహస్యం ఎలా తెలిసింది? అందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? ఆ గుడిలో ఉన్న అంతు చిక్కని రహస్యం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: నిధి వేట.. ఆలయంలో అంతు చిక్కని రహస్యం ఇలాంటి కథా వస్తువులు ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తాయి. (Maayon review) అయితే, వాటిని ఎంత ఉత్కంఠగా చూపించామన్నదాని మీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. క్లైమాక్స్‌లో బలమైన పాయింట్ ఉన్నప్పుడే సినిమా చూసిన ప్రేక్షకుడు తృప్తి చెందుతాడు. ‘ఇంతేనా’ అనిపిస్తే పెదవి విరుస్తాడు. అలాంటి కథతో వచ్చిన తమిళ చిత్రమే ‘మాయోన్’. ప్లాట్ పాయింట్ ఏంటో ప్రచార చిత్రాలతోనే చూపించింది చిత్ర బృందం. అందుకు తగినట్లు సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఎన్.కిషోర్ తనవంతు ప్రయత్నం చేశాడు. పాత్రలన్నింటినీ నెగెటివ్ షేడ్స్‌తో ప్రారంభించి, ప్రతి పాత్రపైనా ప్రేక్షకుడిలో అనుమానం కలిగించేలా కథను ప్రారంభించాడు. కథను నెమ్మదిగా ప్రారంభించడంతో.. దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయమే పట్టింది. ఆలయానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడంతోనే ప్రథమార్ధమంతా సాగుతుంది. అసలు కథ ద్వితీయార్ధంలో మొదలవుతుంది. అక్కడి నుంచి, కథా, కథనాలు పరుగులు పెడతాయి. ప్రతి సన్నివేశం ఉత్కంఠ కలిగిస్తుంది. ఒకవైపు దేవుడు, మరోవైపు సైన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సన్నివేశాలను తీర్చిదిద్దారు. అయితే, ఏ పాత్ర కథపై బలమైన ముద్రవేయలేకపోయింది. (Maayon review) పతాక సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నాయి. విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా పెద్దగా నాణ్యత లేదు. బహుశా ఓటీటీని దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలను చుట్టేశారేమో. చాలా చోట్ల ‘కార్తికేయ’, ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రాలను తలపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: అర్జున్ పాత్రలో సిబి రాజ్ ఒదిగిపోయి నటించారు. చివరి వరకూ ఆయన పాత్రలో ప్రతినాయక లక్షణాలు కనిపిస్తాయి. పురావస్తు శాస్త్రవేత్తగా, నిధి రహస్యాన్ని కనిపెట్టే వ్యక్తిగా ఆయన స్టైల్, మేకోవర్ బాగుంది. కథానాయిక తాన్య రవిచంద్రన్‌కు పెద్దగా ప్రాధాన్యం ఏమీ లేదు. హీరోయిన్ ఉండాలి కాబట్టి, ఆమెను తీసుకున్నారంతే. హరీశ్ పేరడి, కె.ఎస్.రవికుమార్, రాధా రవి, భగవతి పెరుమాళ్ ఇలా ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసిన నటులు కాదు. ఇళయరాజా నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పాటలకు పెద్దగా స్కోప్‌లేదు. రామ్పాండియన్ ఎడిటింగ్ బాగుంది. సినిమా నిడివి కూడా తక్కువే. సినిమాటోగ్రాఫర్ రామ్‌ప్రసాద్ ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిగా చూపించారు. ఆలయంలో లైట్ఎఫ్టెక్లు ఉత్కంఠ కలిగిస్తాయి. దర్శకుడు ఎన్.కిషోర్ ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. కానీ, స్క్రీన్‌ప్లేను ఆసక్తిగా నడిపించటంలో కాస్త సక్సెస్ అయ్యారు. అయితే, సినిమా మొత్తం ఒకే పాయింట్ చుట్టూ తిరగడం ఆసక్తిగా అనిపించదు. అడ్వెంచర్ మూవీలను ఇష్టపడేవారికి ‘మాయోన్’ బాగానే నచ్చుతుంది.(Maayon review) కాలక్షేపం కోసం సినిమా చూడాలనుకున్నా పర్వాలేదు.
బలాలు
+ ద్వితీయార్ధం
+ ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు
బలహీనతలు
- రొటీన్ పాయింట్
- ప్రథమార్ధం కొన్ని సన్నివేశాలు
చివరిగా: కాలక్షేపం కోసం అడ్వెంచర్ ‘మాయోన్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా?