Macherla Niyojakavargam: కలెక్టర్‌ సాబ్‌.. సిద్ధార్థ్‌ రెడ్డి

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం    విడుదల చేశారు.

Updated : 27 Mar 2022 07:35 IST

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో నితిన్‌ గుంటూరు జిల్లా  కలెక్టర్‌గా సిద్ధార్థ్‌ రెడ్డి అనే పాత్రలో నటిస్తున్నారు. ప్రచార చిత్రంలో నితిన్‌ మాస్‌ లుక్‌లో కనిపించారు. బ్లాక్‌ డ్రెస్‌ ధరించి.. సీరియస్‌గా కూర్చున్న తీరు  ఆసక్తిరేకెత్తిస్తోంది. బ్యాగ్రౌండ్‌లో కొందరు విలన్లు పులివేషాల్లో కత్తులు పట్టుకొని ఉండటం కనిపించింది. ‘‘నా మొదటి ఛార్జ్‌ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్ధార్థ్‌ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే, మీరు మెచ్చే మాస్‌ అంశాలతో వస్తున్నా’’ అంటూ ఫస్ట్‌లుక్‌ను పంచుకుంటూ నితిన్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వర సాగర్‌, కూర్పు: కోటగిరి   వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని