Nithiin: సెట్స్‌లో నితిన్‌, కృతిశెట్టి నవ్వులు.. ‘మాచర్ల..’ మేకింగ్‌ వీడియో చూశారా!

‘మాచర్ల నియోజకవర్గం’ మేకింగ్‌ వీడియో. నితిన్‌, కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Published : 09 Aug 2022 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌ (Nithiin) హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు, పాటల చిత్రీకరణను ఈ వీడియోలో చూడొచ్చు. పోరాట దృశ్యాల్ని ఎంత కష్టపడి తెరకెక్కిస్తారో, డ్యాన్స్‌ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చిన సమయంలో నాయకానాయికలు నితిన్‌, కృతిశెట్టి సరదాగా కబుర్లు చెప్పుకొని.. నవ్వుకునేవారని ఈ వీడియోలోని కొన్ని క్లిప్పింగ్స్‌ చూస్తే తెలుస్తోంది. పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఎం. ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ‘మాచర్ల నియోజకవర్గం’తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో నితిన్‌ సరసన కృతిశెట్టితోపాటు కేథరిన్‌ కనిపించనున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, సముద్ర ఖని, శుభలేఖ సుధాకర్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ పొలిటికల్‌ యాక్షన్‌ సినిమాకి మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని