Macherla Niyojakavargam: ఓటీటీలోకి ‘మాచర్ల నియోజకవర్గం’.. స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే!

‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఎప్పుడు? ఏ ఓటీటీలో అంటే?

Updated : 07 Dec 2022 21:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌ (Nithiin) హీరోగా తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఈ ఆగస్టులో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ శుక్రవారం ఖరారైంది. ‘జీ 5’లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌ అందుకున్న కథానాయకుడు రాక్షస రాజ్యాన్ని తలపించే మాచర్ల నియోజకవర్గ రూపురేఖలను ఎలా మార్చాడు? అన్న కథాంశంతో నూతన దర్శకుడు ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెరకెక్కించారు. నితిన్‌ సరసన కృతిశెట్టి, కేథరిన్‌ నటించారు. ఇతర సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం ఓటీటీ విడుదల ఆలస్యమే.

ఉచితంగా..

‘కింగ్‌ ఆఫ్‌ సర్పెంట్‌’  అనే చైనీస్‌ సినిమాని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఉచితంగా చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తున్నట్టు జీ 5 సంస్థ ప్రకటించింది. ‘‘మనుషుల ప్రాణాలను తీసే భయంకర సర్పం. క్షణక్షణం ఉత్కంఠ భరితం. ఈ రోజే చూసేయండి’’ అంటూ ఓ పోస్ట్‌ పెట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు