Nithiin: నా నమ్మకం మరోసారి నిజమైంది

నితిన్‌ కథానాయకుడిగా ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

Updated : 14 Aug 2022 09:26 IST

- నితిన్‌

నితిన్‌ (Nithiin) కథానాయకుడిగా ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత నా జానర్‌ను మార్చి యాక్షన్‌లోకి వెళ్లాను. దాన్ని ప్రేక్షకులు ఆదరించి.. నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనింగ్‌ ఇచ్చారు. నాకు మీ ప్రోత్సాహమెప్పుడూ ఇలాగే ఉంటుందని నమ్మాను. ఈ చిత్రంతో నా నమ్మకం మరోసారి నిజమైంది. సినిమాని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూశాను. యాక్షన్‌, కామెడీ సీన్స్‌కు మీరు కొట్టే చప్పట్లు, వేసే విజిల్స్‌ మంచి ఉత్సాహాన్నిచ్చాయి. సినిమా వసూళ్లు చాలా బాగున్నాయి. రెండో రోజు చాలా బలంగా ఉందని చెబుతున్నారు. ఇలాగే కష్టపడుతూ.. ఇంకా మంచి చిత్రాలు తీస్తాను’’ అన్నారు. ‘‘తొలిరోజే రూ.10కోట్లు వసూళ్లు రావడం మామూలు విషయం కాదు. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘మాచర్ల..’ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కుటుంబంతో కలిసొచ్చి సినిమా ఎంజాయ్‌ చేయండి’’ అంది నాయిక కృతి శెట్టి. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘సినిమాని థియేటర్‌లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. వసూళ్లు  అద్భుతంగా ఉన్నాయి. నాకు అండగా నిలిచిన చిత్ర బృందానికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నితిన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ ఇది. పాండమిక్‌ తర్వాత ఈస్థాయిలో వసూళ్లు రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత నిఖితా రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌ మూరెళ్ల, సాహి సురేష్‌, ఠాగూర్‌ మధు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని