Rocketry: ఆ ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ తీశా.. వారంతా భారత్‌కు తిరిగిరావాలి: మాధవన్
స్వీయ దర్శకత్వంలో మాధవన్ నటించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. 1994లో అన్యాయంగా జైలుపాలైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాధారంగా తెరకెక్కింది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు జులై 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే మాధవన్ మీడియాతో మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: స్వీయ దర్శకత్వంలో మాధవన్ (Madhavan) నటించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry). 1994లో అన్యాయంగా జైలుపాలైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ పాన్ ఇండియా చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మాధవన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఆ ఆలోచనతోనే..
‘‘నేను గతంలో నటించిన ‘విక్రమ్ వేద’ సినిమా సమయంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు సంబంధించిన వార్తలు చదివా. ఆయనకు మాల్దీవులకు చెందిన అమ్మాయితో సంబంధం ఉందని, మన దేశ రాకెట్ సాంకేతికతను ఆయన రహస్యంగా పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారని, ఆ నేరారోపణలతో ఆయన్ను అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టారని, సీబీఐ చేపట్టిన దర్యాప్తులో ఆయన నిరపరాధిగా రుజువయ్యారనే అనేది ఆ వార్తల సారాంశం. ఈ ఘటనల ఆధారంగా సినిమా తీస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచన మొదలైంది’’
నారాయణన్ బాధ అర్థమైంది..
‘‘ఆ ఆసక్తితోనే.. సుమారు ఐదేళ్ల క్రితం నంబి నారాయణన్ సర్‌ను త్రివేండ్రంలో కలిశా. చాలా మర్యాదగా తమ ఇంట్లోకి నన్ను ఆహ్వానించారు. అప్పుడు ఆయన బోనులో ఉన్న సింహంలా అనిపించారు. ఆయన పవర్ఫుల్ కళ్లు నన్ను ఆకర్షించాయి. ‘హాయ్.. మాధవన్, నేను మీకు పెద్ద అభిమానిని. మీ సినిమాలు చూస్తుంటా’ అని నారాయణన్ అనగానే నాకు ఏదో తెలియని ఆనందం. సరదాగా ఉందనకున్న వాతావరణం కాస్తా తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగానే వేడెక్కింది. ‘నన్ను దేశ ద్రోహి అని ఎలా అంటారు?’ అంటూ ఆయన చాలా కోపంగా మాట్లాడారు. మీరు నిర్దోషి అని నిరూపితమైంది కదా అని నేనంటే ‘అది నాకూ నీకూ కోర్టుకు మాత్రమే తెలుసు. అంతెందుకు గూగుల్‌లో వెతికినా నా గురించి గూఢచారి అనే సమాధానమే దొరుకుతుంది’ అని ఆవేదనకు గురయ్యారు. ఆయనెంత బాధ పడుతున్నారో ఆ క్షణం నాకు అర్థమైంది’
జేమ్స్‌బాండ్‌లా..
‘‘తన విద్యాభ్యాసం గురించి వివరిస్తూ.. ప్రిన్స్టెన్ యూనివర్శిటీలో చదువుకున్నానని, రీసెర్చ్ కోసం అక్కడివారంతా ఐదారేళ్ల సమయం తీసుకుంటే తాను పది నెలల్లోనే పూర్తి చేశారని వివరించారు. ఇస్రో, నాసాలకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఆయన చేసిన సాహసాల గురించి వినగానే ‘జేమ్స్ బాండ్’ బాబులా అనిపించారు. నంబి నారాయణన్ ఓ రాక్ స్టార్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది’’
తప్పకుండా తెలుసుకోవాలి..
‘‘ప్రపంచంలో ఏ సైంటిస్ట్ ఎదుర్కోని పరిస్థితులను నంబి నారాయణన్ ఎదుర్కొన్నారు. ఆయన గురించి మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం తప్పక ఉంది. స్వాతంత్ర్య పోరాట యోధులు, ఇతిహాసాలపై తరచూ సినిమాలు వస్తూనే ఉంటాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల మేధావుల గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ని తెరకెక్కించా. ఎన్నో ప్రముఖ విదేశీ సంస్థలకు సీఈవోలుగా భారత ఇంజినీర్స్ బాధ్యతలు వహిస్తున్నారు. అలాంటి వారంతా ఇండియాకు తిరిగి రావాలి’’
మా కష్టమిదీ..!
‘‘ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఆరేళ్ల సమయం పట్టింది. రాకెట్స్, అంతరిక్షం గురించి చాలా సినిమాల్లో చూసుంటారు. మేమిందులో రాకెట్ ఇంజిన్ వ్యవస్థ గురించి చూపించబోతున్నాం. నంబి నారాయణన్ లుక్‌ను తలపించేందుకు బరువు పెరిగా, కొన్ని సన్నివేశాల కోసం బరువు తగ్గా. ఆయనలా కనిపించేందుకు నా దంతాల అమరిక మార్చా. ప్రాస్థటిక్ మేకప్ ఉపయోగించలేదు. ‘బాహుబలి’ని రూపొందించేందుకు ఆ చిత్ర బృందం ఎంత కష్టపడిందో మా టీమ్ కూడా అంతే కష్టపడింది’’ మాధవన్ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు. -
Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట..’లో ‘రంగస్థలం’ ఛాయలు: నిర్మాత ధీరజ్ సమాధానమేంటంటే?
ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఒకటి. టీమ్ ప్రెస్మీట్లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలియజేసింది. -
lavanya tripathi: పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదు!
సినిమాల ఎంపికలో నేనెప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తూనే వచ్చా. ఎక్కువ చిత్రాలు చేసేయాలని ఎప్పుడూ ఆరాటపడలేదు. చేసేవి కొన్ని చిత్రాలైనా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించా. నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నాకలాంటి గుర్తింపునే తీసుకొచ్చాయి’ -
mrunal thakur: నాకొచ్చే పాత్రలు నాకొస్తాయి
నటించిన ప్రతి భాషలోనూ అందం.. ఆకట్టుకునే అభినయంతో తనదైన ముద్ర వేస్తోంది మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’లో సీతగా.. ‘హాయ్ నాన్న’లో యష్నగా తెలుగువాళ్లకి దగ్గరైన ఆమె, ‘పూజా మేరీ జాన్’ హిందీ చిత్ర ప్రచారంలో ఉంది. అందులో భాగంగా తను పంచుకున్న కొన్ని కబుర్లు ఇవి.
తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్