Madhuri Dixit: అమ్మ లేదనే నిజాన్ని నమ్మలేకపోతున్నా.. మాధురి దీక్షిత్ ఎమోషనల్ పోస్ట్
తన మాతృమూర్తి ఎందరినో ఆదరించారని, జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పారని బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
ముంబయి: ఆదివారం మరణించిన తన తల్లి స్నేహలత దీక్షిత్‌ను గుర్తుచేసుకుంటూ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఉదయం నిద్ర లేవగానే అమ్మ గదిని చూస్తే ఖాళీగా, నిశ్శబ్దంగా ఉంది. అమ్మ ఈ లోకంలో లేదనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆమె తన దయా హృదయంతో ఎంతో మందిని ఆదరించింది. ప్రేమను పంచింది. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పింది. తను తిరిగిరాని లోకానికి వెళ్లినా మా జ్ఞాపకాల్లో చిరకాలం బతికే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఓం శాంతి’’ అంటూ తల్లితో గతంలో దిగిన ఫోటోను జత చేశారు మాధురి.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, అభిమానులు, కొందరు సినీ నటులు మాధురి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. మరోవైపు, మాధురి భర్త శ్రీరామ్ తన స్నేహలతతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఆమె మా కుంటుంబానికి ఎంతో ప్రేమను పంచారు. ఎంతో తెలివి, సహనం కలిగిన వ్యక్తి ఆమె. భౌతికంగా మా మధ్య లేకపోయినా మాకు మిగిల్చిన జ్ఞాపకాల మధ్య ఆమె చిరకాలం బతికే ఉంటారు’’ అని పేర్కొన్నారు. అనారోగ్యంతో స్నేహలత (90) ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL: ఇకపై టాస్ గెలిచాకే.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు