Nithiin: ‘మాస్ట్రో’ వచ్చేస్తున్నాడోచ్‌..!

అంధుడి పాత్రలో నితిన్‌ నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మాస్ట్రో’. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అంధాదున్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల షూటింగ్‌ పూర్తి...

Published : 10 Jul 2021 11:53 IST

హైదరాబాద్‌: అంధుడి పాత్రలో నితిన్‌ నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మాస్ట్రో’. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అంధాదున్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని పాటలను వచ్చేవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మాస్ట్రో’ సినిమా సరికొత్త పోస్టర్‌ని అభిమానులతో పంచుకున్న టీమ్‌.. మ్యూజికల్‌ ఫీస్ట్‌ కోసం సిద్ధంగా ఉండమని తెలిపింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా నభానటేశ్‌ సందడి చేయనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ‘మాస్ట్రో’ చిత్రాన్ని నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని