Maha: హన్సిక ‘మహ’.. స్ట్రీమింగ్‌ ఆ ఓటీటీలోనే

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మహ’. ఈ సినిమా ఓటీటీ విడుదల తాజాగా ఖరారైంది. ఎప్పుడు? ఎక్కడంటే?

Published : 06 Sep 2022 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హన్సిక (Hansika Motwani) ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘మహ’ (Maha). ఈ సినిమా ఓటీటీ విడుదల తాజాగా ఖరారైంది. ఈ చిత్రం ఈ నెల 9 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ ఓ పోస్ట్‌ర్‌ని పంచుకుంది. శ్రీకాంత్‌, శింబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 22న థియేటర్లలో విడుదలై, మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. హన్సిక 50వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకి  యు. ఆర్‌. జమీల్‌ దర్శకత్వం వహించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు కిడ్నాప్‌నకు గురైతే, తల్లిగా కథానాయిక ఏం చేసింది? అసలు ఆ పాపను తీసుకెళ్లిందెవరు? ఎందుకు తీసుకెళ్లారు? అనేవి ఈ చిత్రంలోని ఆసక్తికర అంశాలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని