Mahaan: వావ్‌ అనిపిస్తున్న తండ్రీకొడుకులు.. ‘మహాన్‌’ ట్రైలర్‌ అదిరింది!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్రమ్‌, ఆయన తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ కలిసి నటించిన చిత్రం ‘మహాన్‌’.

Published : 03 Feb 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్రమ్‌, ఆయన తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ కలిసి నటించిన చిత్రం ‘మహాన్‌’. సిమ్రన్‌, సింహా, సనంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 10న నేరుగా ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా గురువారం ట్రైలర్‌ విడుదలైంది. విక్రమ్‌ అభిమానులు కోరుకునే మాస్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ప్రచార చిత్రాన్ని బట్టి ఈ సినిమా మద్యనిషేధ పోరాటం చుట్టూ తిరిగే కథగా అనిపిస్తుంది. మద్యనిషేధ ఉద్యమ వీరుడి తనయుడైన విక్రమ్ అదే మద్యాన్ని గ్రామ ప్రజలందరికీ దొంగచాటుగా సరఫరాచేస్తుంటాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన విక్రమ్‌ అలా ఎందుకు చేశాడు? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. తండ్రీకొడుకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎస్‌. ఎస్‌. లలిత్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని