mahasamudram: ‘మహాసముద్రం’ తెలుగు సినిమా గర్వపడే చిత్రం.. శర్వానంద్‌

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా  ఈనెల 14న  విడుదల కానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు.

Updated : 30 Aug 2022 15:56 IST

హైదరాబాద్‌: శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా  ఈనెల 14న  విడుదల కానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. జగపతిబాబు, రావురమేశ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మహాసముద్రం ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో కార్తికేయ, దర్శకులు మెహర్‌ రమేశ్‌, వీరుపొట్ల హాజరయ్యారు.

సిద్దార్థ్‌ మాట్లాడుతూ...‘ తెలుగు ప్రేక్షకులకు నాకు గ్యాప్‌ వచ్చిందని చాలా మంది అంటున్నారు. నన్ను స్టార్‌ని చేసింది తెలుగు ప్రేక్షకులే. నేను ఎక్కడికి వెళ్లట్లేదు. నేను మీ సిద్ధుని. జెమిని కిరణ్‌ వల్లే నేను ఈ సినిమాలో భాగమయ్యాను. సినిమా ట్రైలర్‌ చూసి ఇతర పరిశ్రమల నుంచి ఫోన్లొచ్చాయి. ప్రతి ఒక్కరికి పేరుపేరున అందరికీ థాంక్స్‌. సినిమాలో పనిచేసిన అందరికీ ‘మహాసముద్రం’ మైలురాయిగా మిగిలిపోతుందనే నమ్మకముంది. మహాసముద్రం నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో తెలియదు. కానీ, నాకు ‘మహాసముద్రం’ ద్వారా శర్వానంద్‌ దొరికాడు. ఇది ఎవరి సినిమా అని అడుగుతున్నారు. ఇది కచ్చితంగా శర్వానంద్‌ సినిమానే. ఇది నా కమ్‌బ్యాక్‌ సినిమా కాదు. రీలాంఛ్ లాంటిది. నా ఇండస్ట్రీకి మళ్లీ నన్ను తీసుకొచ్చినందుకు అజయ్‌ భూపతికి కృతజ్ఞతలు’ అన్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ..‘ ఇది నా ఒక్కడి ‘మహాసముద్రం’ అంటే ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. తెలుగు సినిమా అని గర్వపడే సినిమా అవుద్ది. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు అజయ్‌ భూపతికి ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ మనం సినిమాలు చేయాలి’ అన్నారు. 

దర్శకుడు అజయ్‌ భూపతి మాట్లాడుతూ..‘ ‘మహా సముద్రం’ ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేనిది. ఇది భావోద్వేగాల ప్రేమకథ. విభిన్న పాత్రలుంటాయి. యాక్షన్‌ అదే స్థాయిలో ఉంటుంది. సినిమాలో అన్నిరకాల భావోద్వేగాలుంటాయి. ఇద్దరి హీరోలతో సినిమా ఎలా చేస్తావో అని చాలా మంది సందేహపడ్డారు. అఖరికీ ఆర్జీవీ కూడా శర్వానంద్‌, సిద్దార్థ్‌లను ఎలా హాండిల్‌ చేస్తావో చూస్తానన్నారు. నిజానికి హీరోలిద్దరూ అన్నిరకాలుగా సహకరించారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ అదిరిపోద్ది. ఈ సినిమా కథ భిన్నమైంది. నా మీద నమ్మకముంచిన నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసి భావోద్వేగాలు నిండిన కళ్లతో బయటకొస్తారు’ అని అన్నారు. 

మరిన్ని కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని