Dhoni: ‘లవ్‌టుడే’ హీరోయిన్‌తో ధోని తొలి సినిమా

ధోని నిర్మాణసంస్థ ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌’(Dhoni Entertainment) తొలి సినిమాను ప్రకటించింది. ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’(LGM) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ వీడియో విడుదల చేసింది.   

Updated : 27 Jan 2023 17:08 IST

హైదరాబాద్‌: టీంఇండియా మాజీ కెప్టెన్‌ ధోని (Dhoni Entertainment) ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్త బాటలో అడుగు వేశారు. ఈ సంస్థ నిర్మించే తొలి సినిమాలో నటించే తారాగణంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ బ్యానర్‌లో వస్తోన్న సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించారు. ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’(LGM) అనే టైటిల్‌ను ఖరారు చేసి దీనికి సంబంధించిన వీడియో విడుదల చేశారు.

తమిళలో మంచి గుర్తింపు ఉన్న నటుడు హరీష్‌ కల్యాణ్‌(Harish Kalyan) ఇందులో హీరో. అతడి సరసన ‘లవ్‌టుడే’తో యూత్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్‌ ఇవానా(Ivana) నటిస్తోంది. రమేష్‌ తమిళమణి(Ramesh Thamilmani) ఈ సినిమాకు దర్శకుడు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నదియా కీలకపాత్రలో కనిపిస్తారు. తమిళ చిత్ర పరిశ్రమలోకి రావడం గురించి ధోని భార్య సాక్షి(Sakshi Dhoni) మాట్లాడుతూ..‘‘మంచి కథలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడమే మా నిర్మాణ సంస్థ లక్ష్యం. దానికి తగ్గట్టుగానే ఈ బ్యానర్‌లో సినిమాలు వస్తాయి’’ అన్నారు. ఈ బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు దర్శకుడు రమేష్‌.  ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’(LGM) సినిమా కుటుంబమంతా ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని హామీ ఇచ్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు