Vikram: విక్రమ్‌ న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు

కమల్‌హాసన్‌(Kamal Haasan) కీలక పాత్రలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘విక్రమ్‌’(Vikram) ఎంతగానో నచ్చిందని

Published : 03 Jul 2022 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమల్‌హాసన్‌(Kamal Haasan) కీలక పాత్రలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘విక్రమ్‌’(Vikram) ఎంతగానో నచ్చిందని అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh babu) అన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా సినిమాను, అందులోని నటీనటులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

‘‘విక్రమ్‌’ బ్లాక్‌బస్టర్‌ సినిమా. న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌. డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌.. నేను మిమ్మల్ని తప్పకుండా కలిసి, విక్రమ్‌ మొదలైన దగ్గరి నుంచి చివరి వరకూ ఎలా షూట్‌ జరిగిందో అడిగి తెలుసుకుంటా. సినిమా అద్భుతంగా ఉంది. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ నటనలో ఇంతకన్నా గొప్ప మెరుపులు ఉండవు. అనిరుధ్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత ‘విక్రమ్‌’ నా ప్లే లిస్ట్‌లో టాప్‌లో ఉంది. చివరిగా లెజెండ్‌ యాక్టర్‌ కమల్‌హాసన్‌ నటన గురించి మాట్లాడే అర్హత నాకింకా రాలేదు.. సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆయన అభిమానిని. నిజంగా చాలా గర్వంగా ఉంది. కమల్‌ సర్‌... మీకు, మీ ‘విక్రమ్‌’టీమ్‌ శుభాభినందనలు’’ అని ట్వీట్‌ చేశారు.

జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అంతేకాదు, కమల్‌హాసన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. జులై 8వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని