Mahesh Babu: ఎన్టీఆర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో మహేశ్‌బాబు.. అందుకే కలిశారా?

హీరోలతో కసరత్తులు చేయించి, వారిని కొత్తగా చూపించటంలో ముందుంటారు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ . ‘అరవింద సమేత’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలకు సంబంధించి ఎన్టీఆర్‌ శరీరాకృతిని మార్చింది ఆయనే.

Published : 16 Aug 2022 14:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోలతో కసరత్తులు చేయించి, వారిని కొత్తగా చూపించటంలో ముందుంటారు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ (Lloyd Stevens). ‘అరవింద సమేత’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలకు సంబంధించి ఎన్టీఆర్‌ (NTR) శరీరాకృతిని మార్చింది ఆయనే. అలా ‘ఎన్టీఆర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌’గా మంచి గుర్తింపు పొందిన స్టీవెన్స్‌.. మహేశ్‌బాబు (Mahesh Babu)తో ఫొటో దిగటం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మహేశ్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని స్టీవెన్స్‌ పంచుకోవటమే ఆలస్యం.. నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో మహేశ్‌ టీ షర్టు ధరించి, టోపీ పెట్టుకుని నవ్వుతూ కనిపించారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు చేస్తున్న సినిమా (#SSMB28)లో స్టీవెన్స్‌ భాగస్వామి కాబోతున్నారని, ఆయన మహేశ్‌ని చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎస్‌ఎస్ఎంబీ 28’ (వర్కింగ్‌ టైటిల్‌) పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్‌ సరసన పూజా హెగ్డే కనిపించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని