ట్విటర్‌లో #HBDMaheshBabu‌ వరల్డ్ రికార్డు

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు క్రేజ్‌ మరోసారి రికార్డు సృష్టించింది. ఈ రోజు మహేశ్‌ బాబు బర్త్‌డే కావడంతో ట్విటర్‌లో ట్వీట్ల మోత మోగింది. ఒకటి

Published : 10 Aug 2020 01:02 IST

హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు క్రేజ్‌ మరోసారి రికార్డు సృష్టించింది. ఈ రోజు మహేశ్‌ బాబు బర్త్‌డే కావడంతో ట్విటర్‌లో ట్వీట్ల మోత మోగింది. ఒకటిగా మొదలైన ట్వీట్లు... కోట్లు దాటేశాయి. ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. మహేశ్‌కు ట్విటర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు, సెలబ్రిటీలు ట్వీట్ల వర్షం కురిపించారు. గడిచిన 24 గంటల్లో 60.2 మిలియన్ల ట్వీట్లు వచ్చాయి. ఇది వరల్డ్‌ రికార్డు అని మహేశ్‌బాబు పీఆర్‌ టీమ్‌ చెబుతోంది. #HBDMaheshBabu అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇప్పటికీ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు పూర్తయ్యే సరికి ఈ ట్వీట్ల సంఖ్య ఎంతవుతుందో చూడాలి. 

ఈ ఏడాది ఆరంభంలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’తో మహేశ్‌ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ మొదలవ్వాల్సి ఉన్నా కరోనా వైరస్‌ - లాక్‌డౌన్‌ కారణంగా ప్రారంభం కాలేదు. త్వరలోనే ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొదలు కానుంది. ఈ రోజు విడుదల చేసి ‘సర్కారు వారి పాట’ యూనిట్‌ విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని