Mahesh Babu: సోషల్‌ మీడియాలో మహేశ్‌ రికార్డు.. ఫస్ట్‌ సౌత్‌ ఇండియన్‌ హీరోగా!

సోషల్‌మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్స్‌ను కలిగిన ఏకైక సౌత్‌ ఇండియా హీరోగా మహేశ్‌ బాబు (Mahesh babu)రికార్డు సృష్టించాడు. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కోటి మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు.

Published : 29 Mar 2023 19:52 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh babu)కు ఉన్న క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఈ టాప్‌ హీరోకు సోషల్‌మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇప్పుడు అదే ఫాలోయింగ్‌తో నయా రికార్డు సృష్టించాడు. అత్యధిక మంది ఫాలోవర్స్‌ను కలిగిన ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరోగా మహేశ్‌ నిలిచాడు. ప్రతి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫాలోవర్స్‌లోనూ కోటిని క్రాస్‌ చేసి తనకున్న క్రేజ్‌ను చూపాడు.

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్‌బుక్‌ (facebook), ట్విటర్‌ (twitter), ఇన్‌స్టా(instagram)ల్లో మహేశ్‌ ఏకంగా 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మూడు ప్లాట్‌ఫామ్‌లలో కోటిని క్రాస్‌ చేసిన ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరోగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫాలోవర్స్‌ విషయంలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో 10 మిలియన్లను ఎప్పుడో దాటేసిన మహేశ్‌ తాజాగా ఇన్‌స్టాలోనూ కోటికి చేరుకున్నాడు. దీంతో ఈ మూడింటిలో ఎక్కువమంది ఫాలోవర్స్‌ ఉన్న ఏకైక సౌత్‌ ఇండియన్‌ స్టార్‌గా మహేశ్‌ నిలిచాడు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అభిమాన హీరో ఇలా రికార్డు క్రియేట్‌ చెయ్యడంతో ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు (Mahesh social media record).

ఇక సినిమాల విషయానికొస్తే మహేశ్‌ (Mahesh Babu) ప్రస్తుతం త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. ఇందులో మహేశ్‌ సరసన  పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఈ సినిమా (SSMB28) వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో మహేశ్‌ మాస్‌ అవతారంలో కనిపించి అలరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని