Sarkaru Vaari Paata: మహేశ్‌బాబును ఇలా చూసుండరు.. వేదికపై డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

ఎంత పెద్ద నటులైనా వేదికలపై చిన్న డైలాగ్‌ చెప్పాలన్నా, డ్యాన్స్‌ చేయాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. కార్యక్రమాల వ్యాఖ్యాత పట్టుబడితేనో, అభిమానులు కోరితేనో తప్పక ప్రదర్శన ఇస్తుంటారు.

Updated : 17 May 2022 11:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంత పెద్ద నటులైనా వేదికలపై చిన్న డైలాగ్‌ చెప్పాలన్నా, డ్యాన్స్‌ చేయాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. కార్యక్రమ వ్యాఖ్యాత పట్టుబడితేనో, అభిమానులు కోరితేనో తప్పక ప్రదర్శన ఇస్తుంటారు. ఈ విషయంలో ఎంతో స్ట్రిక్ట్‌గా ఉండే మహేశ్‌బాబు(Mahesh babu) ఎవరి బలవంతం లేకుండానే వేదికపై నృత్యం చేయడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎలా అంటే.. మహేశ్‌ హీరోగా దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ మీట్‌ను కర్నూలు ‘యస్‌.టి.బి.టి’ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించారు. ఈ చిత్రంలోని ‘మ మ మహేశ’ పాటకు డ్యాన్సర్లు పెర్ఫామ్‌ చేస్తుండగా సంగీత దర్శకుడు తమన్‌ వెళ్లి కాలు కదిపారు. ఈ ఉత్సాహభరిత వాతావరణాన్ని చూసిన మహేశ్‌ తన సీట్లో కూర్చోలేకపోయారు. తనే స్వయంగా స్టేజ్‌పైకెక్కి స్టెప్పులేశారు. దర్శకుడితో సహా వీఐపీలు అంతా ఆశ్చర్యపోయారు. కేరింతలు, ఈలలు వేయడం అభిమానుల వంతైంది. మరి ఆలస్యమెందుకు మహేశ్‌ హంగామాను మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని