Mahesh Babu: పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న మహేశ్‌బాబు!

పిల్లలు తమకన్నా ఉత్తమ ప్రదర్శన కనబరిస్తే ఏ తల్లిదండ్రులైనా సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా అదే ఆనందంలో ఉన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి ఇటీవల విడుదలైన ‘కళావతి’ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా

Published : 20 Feb 2022 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు తమకన్నా ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఏ తల్లిదండ్రులైనా సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా అదే ఆనందంలో ఉన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి ఇటీవల విడుదలైన ‘కళావతి’ పాట అందరినీ ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాటలో మహేశ్‌ వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాగా.. ఆ స్టెప్పులనే మహేశ్‌ కుమార్తె సితార రీక్రియేట్‌ చేసింది. తన తండ్రిలాగే ఆ పాటకు స్టెప్పులేసి వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇతరులూ ఆ స్టెప్పులు వేయాలంటూ ‘కళావతి ఛాలెంజ్‌’ విసిరింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తాజాగా ఆ వీడియోని మహేశ్‌బాబు తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేస్తూ కుమార్తెపై ప్రశంసలు కురిపించారు. ‘మై స్టార్‌.. నువ్వు నాకన్నా బాగా చేశావు’అని మెచ్చుకున్నారు.


(ఫొటో: మహేశ్‌బాబు ఇన్‌స్టా స్టోరీ స్క్రీన్‌షాట్‌)

యాక్షన్‌-కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలందించారు. ఈ చిత్రం మే 12న విడుదలకానుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని