Indira Devi: అమ్మ జ్ఞాపకాలతో మహేశ్‌బాబు భావోద్వేగం

తన తల్లి ఇందిరా దేవిని తలచుకుంటూ నటుడు మహేశ్‌బాబు భావోద్వేగానికి లోనయ్యారు. మాతృమూర్తి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లారు.

Published : 29 Sep 2022 01:18 IST

హైదరాబాద్‌: తన తల్లి ఇందిరా దేవి ( (Indira Devi) జ్ఞాపకాలను తలచుకుంటూ నటుడు మహేశ్‌బాబు (Mahesh babu) భావోద్వేగానికి లోనయ్యారు. మాతృమూర్తి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఆమెకు సంబంధించి ఓ పాత ఫొటోను షేర్‌ చేశారు. బరువెక్కిన హృదయంతో ఏమి రాయకుండా ‘లవ్‌’ ఎమోజీలు జతచేశారు. ఈ పోస్ట్‌పై పలువురు ప్రముఖులు, లక్షల సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. ‘మహేశ్‌ సర్‌ మీరు ధైర్యంగా ఉండండి’, ‘మేం మీతో ఉన్నాం అన్నా’, ‘బాధపడకండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తల్లి అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం. ఆమె ఆశీస్సుల వల్లే ఈ స్థాయికి వచ్చానని  ఆమెపై ఉన్న ప్రేమను మహేశ్‌ పలు సందర్భాల్లో చాటారు. ఇందిరా దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని