Mahesh babu: బిల్‌ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్‌ వైరల్‌.. ఎక్కడ కలిశారంటే?

టెక్‌ దిగ్గజం, మెక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. లక్షల ‘లైక్స్‌’తో దూసుకెళ్తోంది.

Published : 29 Jun 2022 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ దిగ్గజం, మెక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates), టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. లక్షల ‘లైక్స్‌’తో దూసుకెళ్తోంది. ఈ ఇద్దరు ఎందుకు, ఎక్కడ కలిశారోనన్నదే కదా మీ సందేహం? హాలీడే ట్రిప్‌ కోసం మహేశ్‌బాబు తన కుటుంబంతో కలిసి ఇటీవల న్యూయార్క్‌ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగానే అక్కడున్న బిల్‌ గేట్స్‌ను బుధవారం కలిసి, కాసేపు ముచ్చటించారు. బిల్‌ గేట్స్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ సంబంధిత ఫొటోను మహేశ్‌బాబు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులు, మంచి మనసున్న వ్యక్తుల్లో బిల్‌ గేట్స్‌ ఒకరని, ఆయనో స్ఫూర్తి అని మహేశ్‌ పేర్కొన్నారు.

సినిమాల విషయానికొస్తే.. మహేశ్‌ ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. #SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతున్న చిత్రం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇందులో మహేశ్‌ సరసన పూజాహెగ్డే కనిపించనుంది. ఇది పూర్తయ్యాక, రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు మహేశ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని