Sarileru Neekevvaru: ఈ ఫైట్‌ సీన్‌ చూశారా..?

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తెరపై కనిపించి ఏడాదిన్నర దాటింది. గతేడాది జనవరిలో మహేశ్‌బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలైంది. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

Published : 09 Jul 2021 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తెరపై కనిపించి ఏడాదిన్నర దాటింది. గతేడాది జనవరిలో మహేశ్‌బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మహేశ్‌బాబు మంచి జోష్‌ మీద ఉన్నాడని సంబరపడేలోపే కరోనా మొదలైంది. దీంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. రెండు సినిమాల మధ్య చాలా పెద్ద గ్యాప్‌ వచ్చిందని చాలామంది అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అలాంటి అభిమానులకు ఉపశమనం కలిగించేందుకు ‘అమెజాన్‌ ప్రైమ్‌’ చిన్ని ప్రయత్నం చేసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో బాగా పాపులర్‌ అయిన ‘కొండారెడ్డి బురుజు’ ఫైట్‌ సన్నివేశాన్ని యూట్యూబ్‌లో పంచుకుంది. ‘మహేశ్‌బాబు ఎక్కడా తగ్గరు’ అంటూ రాసుకొచ్చింది. వీడియోను మీరు కూడా చూసి ఆనందించండి మరి.!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని