Updated : 08 Aug 2021 19:20 IST

Mahesh Babu: బర్త్‌డే ముందు అభిమానులకు చిన్న సర్‌ప్రైజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సోమవారం అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో సందడి మొదలైంది. ఆయన అభిమానులు మహేశ్‌ ఫొటోలను పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు. కొందరు తమ డీపీలను మార్చే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబుకు సంబంధించిన సరికొత్త ఫొటో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతకుముందెన్నడూ చూడని స్టైలిష్‌ లుక్‌లో మహేశ్‌ అలరిస్తున్నారు. ఫార్మల్‌ ఔట్‌ఫిట్‌లో స్టైల్‌కే బాస్‌లాగా, మ‌రింత యంగ్‌గా కనిపిస్తున్నారు. ‘మరొక సరదా ఫొటో షూట్‌’ అంటూ అవినాష్‌ గోవర్కర్‌ తీసిన ఈ ఫొటోను మహేశ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు.

ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్నారు. సోమవారం మహేశ్‌ బ‌ర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం మరో సర్‌ప్రైజ్‌ను అభిమానులకు ఇవ్వనుంది. ఇటీవల విడుదల చేసిన స్టైలిష్‌లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్న ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంత్రి కానుకగా జనవరి 13, 2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని