ఆ రికార్డు..‘మహేశ్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌’లకు మాత్రమే సాధ్యమయ్యింది!

అవేమి పాన్‌ ఇండియా సినిమాలు కావు. కనీసం రెండు మూడు భాషల్లో కూడా విడుదల కాలేదు. కేవలం తెలుగులోనే విడుదలై, దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి పదిచిత్రాల జాబితాలో నిలిచాయి. అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా...

Updated : 29 Jul 2022 07:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవేమి పాన్‌ ఇండియా సినిమాలు కావు. కనీసం రెండు మూడు భాషల్లో కూడా విడుదల కాలేదు. కేవలం తెలుగులోనే విడుదలై, దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి పదిచిత్రాల జాబితాలో నిలిచాయి. అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా పాన్‌ ఇండియా చిత్రాల సరసన నిలబడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలను పరిశీలిస్తే..మహేశ్‌ బాబు(Mahesh Babu) నటించిన ‘సర్కారు వారి పాట’(Sarkaru Vari Pata) తెలుగులోనే విడుదలై దేశవ్యాప్తంగా 155కోట్ల వసూళ్లను సాధించింది. ఇక పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘భీమ్లా నాయక్‌’ (Bheemla Nayak) సైతం 132 కోట్ల వసూళ్లను సాధించి దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. ఈ జాబితాలో ఈ రెండు చిత్రాలు మాత్రమే ఏకభాషలో విడుదలై 100కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. మిగతా చిత్రాలన్నీ పాన్‌ఇండియా రిలీజ్‌, పాన్‌ ఇండియా సినిమాలుగానే ఆ మార్కును అందుకోవటం గమనార్హం. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘సర్కారు వారి పాట’ ఎనిమిదో స్థానంలో నిలిస్తే, ‘భీమ్లా నాయక్‌’ పదో స్థానం సాధించింది. కేవలం ఒక భాషలోనే సినిమా విడుదలై 100కోట్ల వసూళ్లు సాధించే స్టామినా ఉన్నా హీరోలుగా మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ నిలిచారు. ఇప్పటివరకూ వీళ్లిద్దరిలో ఎవరూ  పాన్‌ ఇండియా సినిమా  చేయకపోవడం విశేషం. వీరి గత చిత్రాలు సైతం సునాయసంగా వందకోట్ల మార్కును అందుకున్నాయి. ప్రస్తుతం మహేశ్‌ బాబు-త్రివికమ్‌ కాంబినేషన్లో ‘మహేశ్‌బాబు 28’ ఆగస్టులో పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉండగా, పవన్‌ కల్యాణ్-క్రిష్‌ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘హరిహర వీరమల్లు’ తదుపరి షూటింగ్‌ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని