#SSMB29: ట్విటర్‌ ట్రెండింగ్‌లో మహేశ్‌- రాజమౌళి పిక్‌.. వారెక్కడ కలుసుకున్నారు?

మహేశ్‌బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి ఉన్న ఓ ఫొటో ట్విటర్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది.

Published : 17 Mar 2023 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని ఫొటోలు/ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లోనే వైరల్‌గా మారతాయి. లక్షల లైక్స్‌, కామెంట్లతో ట్రెండింగ్‌లో నిలుస్తాయి. అలా.. హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), దర్శకుడు రాజమౌళి (Rajamouli) కనిపిస్తున్న ఈ పిక్‌ ట్విటర్‌లో ప్రస్తుతం హవా కొనసాగిస్తోంది. ఇది ఎలా బయటకొచ్చిందో తెలియదుగానీ నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఆ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ ఏ చిన్న విషయం బయటకొచ్చినా అది సంచలనంగా మారింది. ఇప్పుడీ స్టిల్‌ కూడా ఆ లిస్ట్‌లో చేరింది. పిక్చర్‌ను పరిశీలిస్తే.. మహేశ్‌ ఏదో చెబుతుంటే రాజమౌళి ఆసక్తిగా వింటున్నట్టు ఉంది కదూ! అయితే, తమ తదుపరి చిత్రం గురించి చర్చించుకున్నారా? వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారా? అనేది సస్పెన్స్‌. ‘‘ఇది ఎప్పటి ఫొటో? ఎక్కడ కలుసుకున్నారు?’’ అంటూ కొంతమంది అభిమానులు ఆరా తీస్తుంటే.. ‘‘రీసెంట్‌గా కలిశారు’’ అంటూ కొందరు తమకు తెలిసినట్టు చెబుతున్నారు. బాక్సాఫీసును షేక్‌ చేసే కాంబో, టూ మాన్‌స్టర్స్‌ ఇన్‌ ఫ్రేమ్‌ అంటూ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘ఆస్కార్‌’ పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లిన రాజమౌళి.. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ గ్యాప్‌లోనే మహేశ్‌.. రాజమౌళిని కలిసుంటారని, ఆస్కార్‌ వేడుకకు హాజరవకముందు ఫొటో అయిండొచ్చనేది సినీ వర్గాల మాట. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా #ssmb29 తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేశ్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అది పూర్తయ్యాక తదుపరి సినిమాలో నటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని