Mahesh babu: స్విమ్మింగ్‌ రాకపోయినా.. ‘1’ మూవీ కోసం మహేశ్‌బాబు సాహసం

‘1: నేనొక్కడినే’ సినిమా కోసం మహేశ్‌బాబు రియల్‌ స్టంట్‌ చేశారట. ఇదే విషయాన్ని గతంలో ఒకసారి సుకుమార్‌ కూడా పంచుకున్నారు.

Published : 08 May 2023 16:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అటు యువతతో పాటు, ఇటు మాస్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న స్టార్‌ హీరో మహేశ్‌బాబు (Mahesh babu). సుకుమార్‌ (sukumar) దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘1: నేనొక్కడినే’. బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా టెక్నికల్‌గా హై స్టాండడ్‌లో తెరకెక్కించారు. సుకుమార్‌ టేకింగ్‌ విమర్శకులను సైతం మెప్పించింది. అయితే, ఈ సినిమా కోసం మహేశ్‌బాబు రియల్‌ స్టంట్‌ చేశారు. ఇదే విషయాన్ని గతంలో ఒకసారి సుకుమార్‌ కూడా పంచుకున్నారు. మహేశ్‌బాబు విలన్‌ గ్యాంగ్‌ నుంచి తప్పించుకునేందుకు బోటు తీసుకుని సముద్రంలోకి వెళ్తారు. అందులో నటించిన ఆర్టిస్ట్‌లందరూ ప్రొఫెషనల్‌ స్విమ్మర్స్‌ కాగా, మహేశ్‌బాబుకు ఈత సరిగా రాదట. మిగిలిన వాళ్లందరూ లైఫ్ జాకెట్లు వేసుకొని నటిస్తే, మహేశ్‌ అవేవీ లేకుండా రిస్క్‌ చేసి మరీ ఆ సీన్‌లో నటించారు. అంతేకాదు, ఒక ప్రొఫెషనల్‌ డ్రైవర్‌ బోటును ఎలా నడుపుతారో అంతే వేగంతో నడిపారట. ఆ సీన్‌ తీస్తున్నప్పుడు చిత్ర బృందం చాలా కష్టపడిందని సుకుమార్‌ అప్పట్లో చెప్పారు.

అంతేకాదు, హిట్‌ అవ్వాల్సిన సినిమా ఫ్లాప్‌ అయిందన్న బాధ ఎప్పుడూ తనని వెంటాడుతూ ఉంటుందని సుకుమార్‌ అంటుంటారు. ‘‘హిట్‌ అయ్యే సినిమాను ఫ్లాప్‌ చేశానే అనిపిస్తుంది. ఒక సీన్‌తో వెర్షన్‌ మార్చేయొచ్చు. హీరో ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. అది నిజం కాదని, అతను డ్రామా ప్లే చేస్తున్నాడని ఒక వెర్షన్‌ అనుకున్నా. కానీ, నేను ఎమోషనల్‌ సైడ్‌ వెళ్లిపోయా. మొదటి వెర్షన్‌ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్‌ రామ్‌ ఆచంటకి బాగా నచ్చింది. ఆయన మెచ్చుకున్నారు కూడా. కానీ, సినిమా తీసే సమయానికి అది కాస్తా మారిపోయి, ఇప్పుడు మీరు చూస్తున్న వెర్షన్‌ వచ్చింది. ఇంకో రెండు సీన్లు తీసి, ఎడిటింగ్‌ టేబుల్‌పై చూసుకోవాల్సింది. నిడివి పెరిగిపోవడంతో చాలా సీన్లు తీసేశా. అందుకే ప్రేక్షకులకు అర్థం కాలేదేమో’’ అని అన్నారు. ప్రస్తుతం అటు సుకుమార్‌, ఇటు మహేశ్‌ వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌ ఓ సినిమా చేస్తుండగా, సుకుమార్‌ అల్లు అర్జున్‌తో ‘పుష్ప2’ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు