Mahesh Babu: కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ 

త‌న స్వ‌గ్రామం బుర్రిపాలెం గ్రామాన్ని ప్ర‌ముఖ న‌టుడు మ‌హేశ్ బాబు ద‌త్త‌త తీసుకున్న సంగతి తెలిసిందే. సోమ‌వారం.. త‌న తండ్రి, న‌టుడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆ గ్రామ ప్ర‌జ‌ల‌కు కొవిడ్ వ్యాక్సిన్‌ని అందించేందుకు ముందుకొచ్చారు మ‌హేశ్‌

Published : 31 May 2021 15:19 IST

ఇంట‌ర్నెట్ డెస్క్: త‌న స్వ‌గ్రామం బుర్రిపాలెం గ్రామాన్ని ప్ర‌ముఖ న‌టుడు మ‌హేశ్ బాబు ద‌త్త‌త తీసుకున్న సంగతి తెలిసిందే. సోమ‌వారం.. త‌న తండ్రి, న‌టుడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆ గ్రామ ప్ర‌జ‌ల‌కు కొవిడ్ వ్యాక్సిన్‌ని అందించేందుకు ముందుకొచ్చారు మ‌హేశ్‌. ఆంధ్ర హాస్సిట‌ల్స్ సహ‌కారంతో గ్రామ ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా ఈ వ్యాక్సిన్ అందిస్తున్నారాయ‌న‌. మ‌హేశ్ సాయానికి బుర్రిపాలెం ప్ర‌జ‌లు, ఆయ‌న అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా విష‌యానికొస్తే.. ప్ర‌స్తుతం ‘స‌ర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నారు మ‌హేశ్‌. ప‌రశురామ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోంది ఈ చిత్రం. కీర్తి సురేశ్ నాయిక‌. నేడు ఈ సినిమాలోని మ‌హేశ్ ఫ‌స్ట్‌లుక్ వ‌స్తుంద‌ని ఎదురు చూశారు అభిమానులు. ప్ర‌స్తుతం కరోనా ప‌రిస్థితుల దృష్ట్యా ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ ఉండ‌ద‌ని తెలిపింది చిత్ర‌బృందం. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని