Mem famous: కొత్తవాళ్లు ఈ సినిమా తీశారంటే నమ్మలేకపోతున్నా: మహేశ్‌ బాబు

‘మేమ్‌ ఫేమస్‌’ (Mem Famous) చిత్రబృందంపై మహేశ్‌ బాబు (Mahesh Babu) ప్రశంసలు కురిపించారు. కొత్తవాళ్లు ఈ సినిమా తీశారంటే నమ్మలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

Updated : 25 May 2023 16:01 IST

హైదరాబాద్‌: సుమంత్‌ ప్రభాస్‌ (Sumanth Prabhas) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’(Mem Famous) ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ టీమ్‌ ప్రచారాన్ని కొత్తగా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఇది చూసిన స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.

‘మేమ్‌ ఫేమస్‌’ అద్భుతంగా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా సుమంత్‌ ప్రభాస్‌ తన మల్టీ టాలెంట్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. విజవల్స్‌, మ్యూజిక్‌ ఆకట్టుకున్నాయి. ఇంతమంది కొత్తవాళ్లు కలిసి ఈ సినిమా తీశారంటే నమ్మలేకపోతున్నా. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది

- మహేష్‌బాబు 

మహేశ్‌ ట్వీట్‌తో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు హవా చూపిస్తోన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కోట్లు రాబడుతున్నాయి. ఈ ‘మేమ్‌ ఫేమస్‌’ కూడా ఆ స్థాయిలోనే హిట్‌ అవుతుందని కొందరు సినీ ప్రియులు అంటున్నారు. ఇక మహేశ్‌ చేసిన ట్వీట్‌ వైరలవుతుండగా.. నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. కొత్త వాళ్లను ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నెల 31న ఈ చిత్రం పేరును ప్రకటించనున్నారు. కొన్ని రోజులుగా ‘గుంటూరు కారం’ పేరు బలంగా వినిపిస్తోంది. ‘అమరావతికి అటూ ఇటూ’ అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. అసలు టైటిల్‌ ఏదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని