Mahesh Babu: నాన్న.. మీరు గర్వపడేలా చేస్తా

‘‘నా స్ఫూర్తి.. నా ధైర్యం.. నేను చూసినదంతా మీతోనే వెళ్లిపోయాయి’’ అంటూ తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణను తలచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ భావోద్వేగభరిత పోస్ట్‌ను పంచుకున్నారు కథానాయకుడు మహేష్‌బాబు.

Updated : 25 Nov 2022 06:58 IST

మహేష్‌బాబు

‘‘నా స్ఫూర్తి.. నా ధైర్యం.. నేను చూసినదంతా మీతోనే వెళ్లిపోయాయి’’ అంటూ తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణను (Super star Krishna) తలచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ భావోద్వేగభరిత పోస్ట్‌ను పంచుకున్నారు కథానాయకుడు మహేష్‌బాబు (Mahesh Babu). కృష్ణ మరణం తర్వాత తొలిసారి ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘మీ జీవితం ఒక వేడుకలా సాగింది. నిష్క్రమణ అంతే గొప్పగా జరిగింది. అదే మీ గొప్పతనం. తుది శ్వాస వరకు నిర్భయంగా జీవించారు. ధైర్యం, సాహసం మీ స్వభావాలు. మీరే నా స్ఫూర్తి.. ధైర్యం. నాకు ముఖ్యమైనవన్నీ మీతోనే వెళ్లిపోయాయి. కానీ, విచిత్రమేమిటంటే నాలో మనుపెన్నడూ లేని శక్తిని అనుభూతి చెందుతున్నా. ఇప్పుడు నేను మరింత దృఢంగా, నిర్భయంగా ఉన్నాను. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్‌ యూ నాన్న. మీరే నా సూపర్‌స్టార్‌’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు మహేష్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని