MaheshBabu: ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నా.. : మహేశ్‌బాబు

అభిమానులను కలవడం, వాళ్లతో కాసేపు సరదాగా మాట్లాడటం.. తనకెంతో ఇష్టమని, సుమారు రెండేళ్ల నుంచి ఆ మధురానుభవాన్ని మిస్‌ అవుతున్నానని ఇటీవల సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. ‘సర్కారువారి పాట’ ..

Updated : 11 May 2022 13:29 IST

హైదరాబాద్‌: అభిమానులను కలవడం, వాళ్లతో కాసేపు సరదాగా మాట్లాడటం తనకెంతో ఇష్టమని.. సుమారు రెండేళ్ల నుంచి ఆ మధురానుభూతిని మిస్‌ అవుతున్నానని ఇటీవల సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. ‘సర్కారువారి పాట’ రిలీజ్‌ని దృష్టిలో పెట్టుకుని తాజాగా ఆయన అభిమానులతో ముచ్చటించారు. సోషల్‌మీడియా వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వీడియో షేర్‌ చేశారు. ఆ విశేషాలు మీకోసం...

‘సర్కారువారి పాట’లో మీకు నచ్చిన విషయం?

మహేశ్‌: హీరో పాత్రను సృష్టించిన విధానం నాకెంతో నచ్చింది. మీక్కూడా నచ్చుతుంది.

మనీహెయిస్ట్‌ సిరీస్‌లో మీకిష్టమైన పాత్ర ఏమిటి?

మహేశ్‌: ప్రొఫెసర్‌.

మీ నుంచి ఏదైనా సూపర్‌హీరో మూవీ కోరుకోవచ్చా?

మహేశ్‌: నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు.

మార్వెల్‌ లేదా డీసీ.. దేన్ని ఎంచుకుంటారు?

మహేశ్‌: మార్వెల్‌

భవిష్యత్తులో సితారని వెండితెరపై నటిగా చేసే అవకాశం ఉందా?

మహేశ్‌: నాకు తెలిసి తను ఇప్పటికే నటి అయిపోయింది.

మీరెప్పుడూ అంత ప్రశాంతంగా ఎలా ఉండగలరు?

మహేశ్‌: ఎందుకుంటే నేను ప్రశాంతంగా ఉండే వ్యక్తిని కాబట్టి. (నవ్వులు)

షూటింగ్‌లో ఉన్నప్పుడు పరశురామ్‌లో మీరు గుర్తించిన విశేషం ఏమిటి?

మహేశ్‌: ఆయన రైటింగ్ అద్భుతంగా ఉంటుంది.

ఒక రోజులో ఎంత సమయం ఫోన్‌కి కేటాయిస్తారు?

మహేశ్‌: చాలా చాలా తక్కువ

మీ వృత్తి మార్చుకోవాల్సి వస్తే.. ఎవరి వృత్తిని ఎంచుకుంటారు? ఎందుకు?

మహేశ్‌: నో.. నేను ఎప్పటికీ మహేశ్‌బాబు ది యాక్టర్‌గానే ఉండటానికి ఇష్టపడతా.

మీకిష్టమైన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌?

మహేశ్‌: రొనాల్డో

మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?

మహేశ్‌: నా భార్య నమ్రత

మీ కుటుంబంలో స్మార్ట్‌ పర్సన్‌ ఎవరు?

మహేశ్‌: సితార

మీరు ఎప్పుడైనా వేలం పాటలో పాల్గొన్నారా?

మహేశ్‌: లేదు

సర్కారువారి పాటలో మీకు ఇష్టమైన డైలాగ్‌?

మహేశ్‌: మెయిన్‌టెయిన్‌ చేయలేక దూల తీరిపోతుందయ్యా

మీరు వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా చూస్తారని విన్నా. ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన వెబ్‌ సిరీస్‌?

మహేశ్‌: ప్రస్తుతానికి బ్రేక్‌ తీసుకున్నా.

నమ్రతలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి?

మహేశ్‌: ఆమెలో అన్నీ ఇష్టమే అందుకే పెళ్లి చేసుకున్నా

బిజీ షెడ్యూల్స్‌లోనూ మీ పిల్లలకు సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు?

మహేశ్‌: ఎలా అంటే చెప్పలేను కానీ, పిల్లలతో మాత్రం తప్పకుండా సమయాన్ని గడుపుతా.

సర్కారువారి పాటలో మీకిష్టమైన స్టిల్‌

మహేశ్‌: ఫస్ట్‌ పోస్టర్‌.

మిమ్మల్ని ప్రేరేపితం చేసిన సరికొత్త చిత్రం?

మహేశ్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాకెంతో నచ్చింది. అద్భుతమైన చిత్రం.

ఈ సినిమాలో మీకిష్టమైన పాట? 

మహేశ్‌: కళావతి

మీరు వీడియో గేమ్స్‌ ఆడతారా?

మహేశ్‌: ఆడేవాడిని. ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నా.

మీక్కూడా చీట్‌ డే ఉందా?

మహేశ్‌: సండే.. ఎప్పటికీ అదొక చీట్‌ డేనే


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని