Mahesh Babu: అన్నయ్య మృతిపై మహేశ్‌బాబు తీవ్ర భావోద్వేగం

తన సోదరుడు రమేష్‌బాబు ఆకస్మిక మృతిపట్ల నటుడు మహేశ్‌బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రమేష్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు. ఎన్ని జన్మలెత్తినా రమేష్‌న....

Published : 09 Jan 2022 14:43 IST

హైదరాబాద్‌: తన సోదరుడు రమేష్‌బాబు ఆకస్మిక మృతిపట్ల నటుడు మహేశ్‌బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రమేష్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు. ఎన్ని జన్మలెత్తినా రమేష్‌నే అన్నయ్యగా కోరుకుంటానని తెలిపారు. ‘‘నువ్వే నా స్ఫూర్తి, నువ్వే నా బలం, నువ్వే నా ధైర్యం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకుంటే నేను ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు. నాకోసం నువ్వు చేసిన ప్రతి పనికీ ధన్యవాదాలు. ఈ జన్మలోనే కాదు వేరే జన్మ ఏదైనా ఉంటే అందులోనూ నువ్వే నా ‘అన్నయ్య’గా ఉండాలని కోరుకుంటా. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని మహేశ్‌బాబు తెలిపారు.

కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్‌ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.  అంత్యక్రియల్లో మహేశ్‌బాబు పాల్గొనలేకపోయారు. కరోనా కారణంగా మహేశ్‌, ఆయన కుటుంబం ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని