
MaheshBabu: ఆరోజు నాకేమైందో తెలియదు: మహేశ్‌బాబు
నా ఫ్యాన్స్ ఏమంటారోనని కీర్తి భయపడింది
హైదరాబాద్: ‘సర్కారువారి పాట’ సూపర్‌సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. ఆ సినిమాకి అభిమానుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌కు ఆయన ఎంతగానో ఆనందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన కీర్తిసురేశ్, దర్శకుడు పరశురామ్‌తో కలిసి పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ నిర్వహించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. కర్నూలులో జరిగిన విజయోత్సవ సభ గురించి మాట్లాడారు. ఆ రోజు స్టేజ్‌పై డ్యాన్స్ చేయడంపై పెదవివిప్పారు. ఆ విశేషాలు మీకోసం..
ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో మీరు సోఫాలో ఎగిరి కూర్చున్నట్లు చూపించారు. ఆ ఆలోచన ఎలా వచ్చింది?
మహేశ్: కీర్తి నాకు మెస్సేజ్ పెట్టినప్పుడు దాన్ని చూసి సంతోషించి.. వెన్నెల కిషోర్‌తో అదే విషయాన్ని చెప్పి.. అనంతరం ఒక రియాక్షన్ ఇవ్వాలని దర్శకుడు నాతో చెప్పారు. కానీ నాకు అది మరీ సాగదీసినట్లు అనిపించి.. కీర్తి పంపిన మెస్సేజ్ చూసిన వెంటనే సోఫాలో ఎగిరి కూర్చున్నట్లు రియాక్షన్ ఇస్తే బాగుంటుందనిపించింది. అదే కెమెరా ముందు చేశాను. నేను ఆ సీన్ చేసినప్పుడు సెట్లో ఉన్నవాళ్లందరూ గట్టిగా అరిచారు. ఆ రియాక్షన్ బాగా వర్కౌట్ అయ్యిందని హాలులో ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాక అర్థమైంది.
రియల్‌లైఫ్‌లో మీకు టాటూ ఉందా? ఒకవేళ టాటూ వేయించుకోవాలనుకుంటే ఏ డిజైన్, పేరు సెలక్ట్ చేస్తారు?
మహేశ్: ఇప్పటివరకూ నేను టాటూ వేయించుకోలేదు. భవిష్యత్తులో కూడా వేయించుకోవాలనే ఉద్దేశం లేదు. ఎందుకంటే అది చాలా నొప్పితో కూడుకున్న వ్యవహారం.
సినిమాలో ఈఎంఐలు ఎగ్గొట్టేవాళ్లను చూపించారు కదా. ఒకవేళ రియల్ లైఫ్‌లో మీకు తెలిసిన వాళ్లే ఈఎంఐలు ఎగ్గొడుతున్నారని తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్లకి వార్నింగ్ ఇస్తారా?
మహేశ్: ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదమ్మా. ఆయన కథ చెప్పినప్పుడు సినిమా చేయాలనిపించింది. చేసేశాను.
మీ నాన్నగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన సంవత్సరానికి నాలుగు సినిమాలు చేసేవారు. మీరు కూడా అలాగే సినిమాలు చేయాలని కోరుకుంటున్నా..!
మహేశ్: ‘సంవత్సరానికి ఐదారు సినిమాలు చేయొచ్చు కదరా’ అని నాన్నగారు కూడా చెబుతుంటారు. నేను కూడా ప్రయత్నిస్తాను.
ఎవరైనా దర్శకుడు కథ చెప్పినప్పుడు.. మీరు ఎలా దాన్ని ఓకే చేస్తారు?
మహేశ్: పరశురామ్ కథ చెప్పినప్పుడు హీరోహీరోయిన్ ట్రాక్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకూ నా సినిమాల్లో ఇలాంటి ట్రాక్ చేయలేదు. అందుకే ఈసారి ఇలాంటిది చేయాలనే ఆసక్తి పెరిగింది. లుక్ గురించి కూడా ఆయన నాకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కేవలం నా లుక్ డిజైన్ చేసి పిక్ పంపారు. ఇక, ‘మహానటి’ లాంటి సినిమాతో అందరికీ చేరువైన కీర్తి ఇలాంటి డిఫరెంట్ రోల్లో నటించడం.. ఇలా ఎన్నో అంశాలు నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేలా చేశాయి. ఇక, కీర్తికి తన రోల్ గురించి జూమ్ కాల్లో చెప్పాం. ఆమె పడిపడి నవ్వింది.
‘‘షూటింగ్ సమయంలో కీర్తితో జరిగిన ఓ సంఘటన మీతో పంచుకోవాలి. ఈ సినిమాలోని ఓ సీన్లో కీర్తి నన్ను తిట్టాలి. మూడు టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయింది. దాంతో డైరెక్టర్ ఆమె వద్దకు వెళ్లి.. ‘మేడమ్.. మీరు సార్‌ని తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ని మీరు తిట్టాలి’ అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకర్థమైంది. ‘కీర్తి.. పర్వాలేదు నువ్వు నన్ను తిట్టు’ అని చెప్పాను. దానికి ఆమె.. ‘‘సార్.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని ఇప్పుడు తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు’’ అని కంగారుపడుతూ చెప్పింది. ‘‘నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు’’ అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తి చేశాం. కానీ, మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి, నవ్వింది.’’
సినిమాలో మీరు మహేశ్ పర్సు కొట్టేశారు కదా. రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలాంటి దొంగతనాలు చేశారా?
మహేశ్: సినిమాలో అంటే చూపించారు కానీ, నిజ జీవితంలో అలా ఎందుకు చేస్తారండి
కీర్తి: నేను చేశానండి. మా నాన్న పాకెట్లో నుంచి పర్సు కొట్టేశాను. నాకు అలవాటే.
మహేశ్: అయ్యొయ్యో (నవ్వులు)
‘సర్కారువారి పాట’ ప్రకటించిన నాటి నుంచి మీ పేరుపై సోషల్‌మీడియాలో విపరీతంగా మీమ్స్, జిఫ్‌లు వచ్చాయి. వాటిని చూశాక మీ స్పందన?
పరశురామ్: నిజం చెప్పాలంటే సోషల్‌మీడియాలో వచ్చే జీఫ్, మీమ్స్ నాకు పెద్దగా తెలియదు. నా పీఆర్ టీమ్ పంపించినప్పుడు వాటిని చూసి బాగా ఎంజాయ్ చేశా.
మహేశ్: ఆయన పైకి ఇలా మాట్లాడుతున్నాడు కానీ లోపల మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు.
సినిమాలో అభిమానుల కోసమే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. వాటి గురించి ఏదైనా చెప్పగలరు?
మహేశ్: ఆ క్రెడిట్ అంతా పరశురామ్‌దే. కథ చెప్పిన విధానం, పాత్రని తీర్చిదిద్దిన తీరు.. ఇలా ప్రతి విషయంలో ఆయనకు హీరో మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేశాడు. ఆ ప్రేమే నేను ఆయన్ని నమ్మేలా చేసింది. తాళాల కోసం జరిగే ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు.. ‘‘నాకు ఎక్కడబడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు’’ అని డైలాగ్ చెప్పమన్నారు. దానికి నేను ‘‘ఇది ఓకేనా’’ అని సందేహంగా అడిగా. కానీ ఆయన మాత్రం ‘‘నన్ను నమ్మండి సర్. ఇది తప్పకుండా వర్కౌట్ అయ్యింది. థియేటర్లు దద్దరిల్లిపోతాయి’’ అని చెప్పాడు. ఆయన్ని నమ్మేసి చేశా.
మ.. మ.. మహేశా సాంగ్‌పై మీ అనుభవం?
కీర్తి: ఈ సాంగ్‌లో ఒక స్టెప్పు ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా ఆయనతో కలిసి కో ఆర్డినేట్ చేయడం నాకు రాలేదు. చాలాసార్లు ఆయన ముఖంపై కొట్టేశా. రెండు, మూడు సార్లు అలా జరిగిన తర్వాత సార్ నా వద్దకు వచ్చి.. ‘‘నేను ఏదైనా తప్పు చేశానా’’ అని అడిగారు. ఆ స్టెప్పు ఎప్పటికీ మర్చిపోను. అలాగే మరో స్టెప్పు కూడా కొరియోగ్రాఫర్ చెప్పినట్టు నాకు చేయడం రాలేదు. దానికి ఆయన.. ‘‘సరే సరే. నువ్వు అలాగే చెయ్. నేను కూడా అలాగే చేస్తా’’ అని చెప్పారు.
మహేశ్: నేను చేసిన పాటల్లో మోస్ట్ ఎనర్జిటిక్ సాంగ్ ఇది. మొదటి రెండు రోజులు కష్టంగా అనిపించినా.. మూడోరోజు అదిరిపోయింది. సినిమా అనుకున్నప్పుడు, షూట్ చేసినప్పుడు ఈ సాంగ్ లేదు. కానీ, సినిమా మొత్తం పూర్తయ్యాక కాపీ చూసి.. ఇలాంటి ఒక పాట ఉంటే బాగుంటుందనిపించి, అప్పటికప్పుడు చేశాం. సాంగ్‌కి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఇదో మేజిక్‌లా ఉంది. ఇది నా కెరీర్లో బెస్ట్ సాంగ్.
రూపాయి కాయిన్‌తో మీరు అమెరికా ఎలా వెళ్లారు?
పరశురామ్: పది వేల డాలర్స్ కావాలంటూ హీరోయిన్ వెళ్లి హీరోని డబ్బు అడిగినప్పుడు.. తాను ఒక చర్చి ఫాదర్ సాయంతో అమెరికాకి వచ్చినట్టు చెబుతుంది. అప్పుడు కిషోర్ హీరోతో.. ‘అదేంటి సార్. ఈఅమ్మాయి మన కథ మనకే చెబుతుంది’ అని అంటాడు. హీరోయిన్ మాదిరిగానే హీరో కూడా వేరే వ్యక్తి సాయం చేస్తే అమెరికాకి వచ్చాడు.
పోకిరి తర్వాత ఈ సినిమాలోనే మిమ్మల్ని ఎంత ఎనర్జిటిక్‌గా చూశాం. తదుపరి చిత్రాల్లోనూ ఇలాగే చూడొచ్చా?
మహేశ్: పాత్రని బట్టి ఉంటుంది అది. ఒక నటుడిగా సినిమా, కథకు అనుగుణంగా నటిస్తా.
కర్నూలులో మీరు స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేశారు కదా. అస్సలు మీరు అలా ఎందుకు చేశారు?
మహేశ్: అది ఎందుకు అలా జరిగిందో నాక్కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీమ్ మొత్తం షాక్, సర్ప్రైజ్లో ఉండిపోయింది. రెండేళ్లు కష్టపడి సినిమా చేశాం. దానికి అభిమానుల నుంచి వస్తోన్న ఆదరణ చూశాక.. స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేయాలనిపించింది. అలా, చేసేశా’’
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
President Election: నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి.. రాష్ట్రపతి రేసులో ఆ ఇద్దరే!
-
Sports News
RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
-
General News
Health: ఉబ్బిన సిరలకు సూపర్ గ్లూ..ఏంటో తెలుసుకోండి
-
General News
Andhra News: ఈఏపీసెట్-2022కు ఏర్పాట్లు పూర్తి... ఏపీ, తెలంగాణలో పరీక్షాకేంద్రాలు
-
Politics News
Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ
-
India News
తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్‌చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ