MaheshBabu: మహేశ్‌ ఫుల్‌ హ్యాపీ.. సూపర్‌ ఫ్యాన్స్‌ అంటూ ట్వీట్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన సమ్మర్‌ సెన్సేషనల్‌ ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి...

Published : 18 May 2022 15:24 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన సమ్మర్‌ సెన్సేషనల్‌ ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మహేశ్‌ క్లాస్‌ లుక్స్‌, మాస్‌ డైలాగ్‌లతో ఈ సినిమా అభిమానులకు కలర్‌ఫుల్‌ ట్రీట్‌గా మారింది. చాలా రోజుల తర్వాత మహేశ్‌ని ఇలాంటి రోల్‌లో చూడటంపై వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా సక్సెస్‌పై మహేశ్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. సోమవారం కర్నూలులో జరిగిన విజయోత్సవ వేడుకల్లో స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. తాజాగా తన అభిమానుల్ని ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టారు.

‘‘సర్కారువారి పాట’ పట్ల చూపిస్తోన్న అభిమానికి ఎంతో సంతోషిస్తున్నా..! బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందించిన నా సూపర్‌ ఫ్యాన్స్‌ అందరికీ ధన్యవాదాలు. చిత్ర బృందానికి ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు పరశురామ్‌, మాంచి మ్యూజిక్‌ అందించిన తమన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా నాకెప్పటికీ ప్రత్యేకమే’’ అని మహేశ్‌ రాసుకొచ్చారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు