
MaheshBabu: ఆ సినిమా చూస్తే నాకు కన్నీళ్లు వస్తాయ్: మహేశ్
హైదరాబాద్: ‘సర్కారువారి పాట’తో సూపర్‌సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh babu). సుమారు రెండేళ్ల తర్వాత తన విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండటంతో మహేశ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన ఓ మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. తన గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను మ్యాగజైన్‌తో పంచుకున్నారు. అనంతరం రాపిడ్ ఫైర్ రౌండ్ మహేశ్ ఎన్నో సరదా సంగతులు తెలియజేశారు. ఆ విశేషాలు..
మిమ్మల్ని ఎక్కువగా ఏ నిక్ నేమ్‌తో పిలుస్తారు?
మహేశ్: నాని
మీరు ఎక్కువగా భయపడే విషయం?
మహేశ్: నా దర్శకుల అంచనాలు అందుకోలేనేమోనని ఎక్కువగా భయపడుతుంటా!
మీ గురించి కేవలం మీ కుటుంబానికి మాత్రమే తెలిసిన ఒక విషయం?
మహేశ్: నేను ఎంతో సరదాగా ఉండే వ్యక్తిని. నా భార్యాపిల్లలకు మాత్రమే ఇది తెలుసు.
మీరు ఇప్పటివరకూ చేసిన అడ్వెంచర్?
మహేశ్: న్యూజిలాండ్‌లో బంగీ జంప్ చేశా.
మీ ఊత పదం?
మహేశ్: బ్యూటీఫుల్
ఏ సినిమా చూసి మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు?
మహేశ్: లయన్ కింగ్. ఆ సినిమా చూసినప్పుడల్లా నాకు కన్నీళ్లు వచ్చేస్తాయి.
ఇక దర్శకుడిగా మీ సినిమాలను మీరే రీక్రియేట్ చేయాలనుకుంటే దేన్ని చేస్తారు?
మహేశ్: ఒక్కడు
మీ ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమా?
మహేశ్: అల్లూరి సీతారామరాజు
ఇప్పటివరకూ మీరు రుచి చూసిన ఫుడ్స్‌లో ఏది కాస్త వింతగా అనిపించింది?
మహేశ్: థాయ్‌లాండ్‌లో ఓసారి విభిన్నమైన సీ-ఫుడ్ తిన్నాను. దాని పేరు గుర్తులేదు. కానీ చాలా వింతగా అనిపించింది. నాకస్సలు నచ్చలేదు.
ఫ్యామిలీ డిన్నర్ కోసం ఎక్కువగా వెళ్లే రెస్టారెంట్?
మహేశ్: హైదరాబాద్‌లో దక్షిణ్.. అక్కడ దక్షిణాది భోజనం చాలా బాగుంటుంది.
మీరు ఎలా రిలాక్స్ అవుతుంటారు?
మహేశ్: ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌కు వెళ్తుంటాను.
వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు మీరు ఎక్కువగా చేసే పని?
మహేశ్: ఇష్టమైన ఫుడ్ తినడం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
-
Politics News
Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన
-
World News
Bette Nash: 86 ఏళ్ల వయసులోనూ ఎయిర్‌హోస్టెస్‌గా.. ఈ బామ్మ గిన్నిస్ రికార్డ్..!
-
India News
President Election: నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి.. రాష్ట్రపతి రేసులో ఆ ఇద్దరే!
-
Sports News
RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
-
Movies News
Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
- Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా