Mahesh Babu: నా ఫైటింగ్‌ సీన్స్‌ నా కూతురికి నచ్చవు

వచ్చే ఏడాది ఉగాది కానుకగా మహేశ్‌ బాబు చిత్రం ‘సర్కారు వారి పాట’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలుత సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం పలు కారణాలతో వేసవికి వాయిదా పడింది. తాజాగా మహేశ్‌బాబు ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విధంగా స్పందించారు...

Updated : 10 Aug 2022 11:19 IST

వచ్చే ఏడాది ఉగాది కానుకగా మహేశ్‌ బాబు చిత్రం ‘సర్కారు వారి పాట’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలుత సంక్రాంతి బరిలో నిలవాలనుకున్నప్పటికీ పలు కారణాలతో వేసవికి వాయిదా పడింది. తాజాగా మహేశ్‌బాబు ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విధంగా స్పందించారు. ‘‘ హీరోయిన్లతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు, విలన్స్‌తో ఫైట్స్‌ చేస్తున్నప్పుడు మీ పిల్లలు ఎలా స్పందిస్తారు’’ అని అడగగా.. ‘‘ గౌతమ్‌, సితార.. ఇద్దరికీ యాక్షన్‌ సన్నివేశాలు నచ్చవు. ఎప్పుడైనా ఫైటింగ్‌ సన్నివేశాలు వస్తే చాలు.. సితార అయితే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. విడుదలైన రోజే నా సినిమాలను ఇంట్లో చూస్తాం. పిల్లల్లిద్దరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు. మనం ఎంతో కష్టపడి పనిచేస్తాం. దానికి సరైన బహుమతి ఎంటో తెలుసా..మన పిల్లలతో కలిసి చూడటమే. నా సినిమా విడుదలైన మొదటిరోజు.. పిల్లలు సినిమా చూసి ఏమంటారోనని చాలా భయపడుతా. అదే విధంగా కొంచెం నెర్వస్‌, కొంచెం ఎగ్జైట్‌మెంట్‌తో ఉంటా’’.

ఆ నిర్ణయం వాళ్లకే వదిలేశాం..
గౌతమ్‌, సితార ఇద్దరూ సినిమాల్లోకి వస్తారా లేదా అనే నిర్ణయాన్ని వాళ్లకే వదిలేశాం. వాళ్లు ఏం చేస్తానన్నా దాన్ని మేం స్వాగతిస్తాం. ప్రస్తుతం గౌతమ్‌  టెన్ట్‌ గ్రేడ్‌లో ఉన్నాడు. లండన్‌ కెళ్లి చదువుకుంటా అంటున్నాడు. సితార చాలా పనులు చేస్తుంటుంది. కాబట్టి ఏం అవుతుందన్నది నాకు తెలియదు. ప్రస్తుత రోజుల్లో సినిమా అనేది ఒక సీరియస్‌ ఫ్రొఫెషన్‌. వాళ్లంతట వాళ్లు కష్టపడుతామని కమిట్‌మెంట్‌తో ముందుకు రావాలి’’ అని మహేశ్‌ అన్నాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని