Updated : 17 Aug 2022 10:28 IST

Maheshbabu: కసరత్తులు షురూ

మహేష్‌ బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) కలయికలో సినిమా ఈ నెలలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి. నిర్మాతలు చిత్రీకరణల నిలిపివేతతో ఆలస్యమైంది కానీ... లేదంటే ఈపాటికే పట్టాలెక్కేదే. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక. కొన్నాళ్లుగా దీనికోసం చిత్రబృందం సన్నాహాలు చేసుకొంటోంది. కథానాయకుడు మహేష్‌ తన మేకోవర్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. హెయిర్‌స్టైల్‌తోపాటు, ఫిజికల్‌గానూ కొత్తగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ నేతృత్వంలో కసరత్తులు షురూ చేశారు. ‘అరవింద సమేత’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం ఎన్టీఆర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ దగ్గరే ట్రైన్‌ అయ్యారు. మహేష్‌బాబు 28వ చిత్రం త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనూ, ఆయన 29వ చిత్రం రాజమౌళి దర్శకత్వంలోనూ చేయనున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts