Maidaan Teaser: అసామాన్య హీరో కథ.. ‘మైదాన్‌’

భారతీయ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్‌’. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సినిమాలో స్పోర్ట్స్‌ కోచ్‌గా నటిస్తున్నారు అజయ్‌.

Updated : 31 Mar 2023 06:57 IST

భారతీయ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సినిమాలో స్పోర్ట్స్‌ కోచ్‌గా నటిస్తున్నారు అజయ్‌. భారతదేశానికి ఫుట్‌బాల్‌ ఆటలో రికార్డులు సృష్టించిన ఒక అసామాన్య హీరో కథను, అతని కలలు, పోరాటాన్ని ఇందులో చూపించనున్నారు. కాళ్లకు బూట్లు లేకుండా ఫుట్‌బాల్‌ ఆడిన రోజుల నాటి నుంచి అద్భుతమైన విజయాలు సాధించి ఆటకు స్వర్ణయుగంగా మారిన పదేళ్ల (1950-62) కాలంలో జరిగిన సంఘటలను కళ్లకు కట్టినట్టు ఇందులో చూపించనున్నారు. సినిమాలో కీర్తిసురేష్‌, ప్రియమణి, గజరాజ్‌ రావ్‌, రుద్రనీల్‌ ఘోష్‌ కీలక పాత్రలను పోషించారు. బోనీకపూర్‌, అరుణవ్‌ జాయ్‌ సేన్‌గుప్తా, ఆకాష్‌ చావ్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌ 23న ఈ సినిమా విడుదల కానుంది. గురువారమే అజయ్‌దేవ్‌గణ్‌ ‘భోళా’ కూడా థియేటర్లలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని