Major: ఓటీటీలోకి ‘మేజర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

అడివి శేష్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘మేజర్‌’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్‌ 3న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్లో స్ఫూర్తినింపింది.

Published : 01 Jul 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అడివి శేష్‌ (Adivi Sesh) ప్రధాన పాత్ర పోషించిన ‘మేజర్‌’ (Major) సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో జులై 3 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్టు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రసారంకానుంది. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్‌ 3న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్లో స్ఫూర్తినింపింది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన వీర జవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సైనికుడిగా సందీప్‌ చేసిన సాహసాలతోపాటు ఆయన జీవన విధానాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఆయన బాల్యం ఎలా గడిచింది? సైనికుడిగా ఎందుకు మారాలనుకున్నారు? ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలేంటి? తదితర అంశాలతో రూపొందిన ఈ సినిమాలో సందీప్‌ తల్లిదండ్రులుగా ప్రకాశ్‌రాజ్‌, రేవతి ఒదిగిపోయారు. నటుడిగా శేష్‌కు మంచి పేరొచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని