అడివి శేష్‌ ‘మేజర్‌’ టీజర్‌ వచ్చేసింది!

థ్రిల్లర్‌ సినిమాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌ మరోసారి సరికొత్త పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ‘మేజర్‌’గా మారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్‌ శశికిరణ్‌ తెరకెక్కించారు.

Updated : 12 Apr 2021 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థ్రిల్లర్‌ సినిమాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌ మరోసారి సరికొత్త పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ‘మేజర్‌’గా మారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్‌ శశికిరణ్‌ తెరకెక్కించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జులై 2న విడుదల కానుంది.

‘‘మన బోర్డర్‌లో ఆర్మీ ఎలా ఫైట్‌ చేయాలి? ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’’ అంటూ శేష్‌ చెబుతున్న డైలాగ్స్‌ ఉద్విగ్నంగా ఉన్నాయి.

సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీశర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు.  తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌లు ఈ టీజర్‌ను విడుదల చేశారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని