Major: ‘మేజర్‌’ ట్రైలర్‌ ఆరోజే

వార్‌.ఎటాక్‌.. యాక్షన్‌.. రొమాన్స్‌... ఫ్యామిలీ... ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఓ వీడియోలో ఆసక్తికరంగా చూపించింది ‘మేజర్‌’ చిత్రబృందం. అడివి శేష్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రమిది.

Updated : 05 May 2022 08:56 IST

వార్‌.ఎటాక్‌.. యాక్షన్‌.. రొమాన్స్‌... ఫ్యామిలీ... ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఓ వీడియోలో ఆసక్తికరంగా చూపించింది ‘మేజర్‌’ చిత్రబృందం. అడివి శేష్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందింది. శశి కిరణ్‌ తిక్కా దర్శకుడు. మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 9న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌, ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని