అనన్య కోసం పూరీతో రాయబారం..?

కుటుంబకథా చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ బాలీవుడ్‌లో సైతం తన లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’ హిందీ...

Published : 21 Feb 2021 08:35 IST

‘ఛత్రపతి’ రీమేక్‌.. చిత్రబృందం ఇబ్బందిపడుతోందా..?

ముంబయి: కుటుంబకథా చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ బాలీవుడ్‌లో సైతం తన లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించనున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆయన అన్నివిధాలుగా సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కనున్న ఈ రీమేక్‌కు సంబంధించి ఓ విషయంలో చిత్రబృందం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ విషయమేమిటంటే.. కథానాయిక ఎంపిక.

భారీ ప్రాజెక్ట్‌గా ఎన్నో అంచనాల నడుమ రానున్న ‘ఛత్రపతి’ రీమేక్‌లో శ్రీనివాస్‌ సరసన కథానాయికగా ఎవరు నటించనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ పేర్లు కూడా తెరపైకి వచ్చినప్పటికీ వాళ్లు మాత్రం రీమేక్‌లో నటించడానికి ఆసక్తి కనబర్చడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్యా పాండే ఈ రీమేక్‌లో నటించే అవకాశమున్నట్లు బాలీవుడ్‌లో టాక్‌. ఆమెతో ఈ ప్రాజెక్ట్ ఆఫర్‌ గురించి చెప్పమని చిత్రబృందం ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సంప్రదించిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లైగర్‌‌‌’లో ప్రస్తుతం అనన్య నటిస్తున్నారు. ఆ చొరవతోనే ఆమెకు ‘ఛత్రపతి’ రీమేక్‌ గురించి చెప్పమని చిత్రబృందం పూరీని కోరినట్లు వినికిడి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని