Vivek Agnihotri: సీఎంకు లీగల్‌ నోటీసులు పంపిన కశ్మీర్‌ ఫైల్స్ డైరెక్టర్

తన సినిమా గురించి పరువు నష్టం కలిగేలా మాట్లాడినందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(West Bengal CM Mamata Banerjee)కి లీగల్‌ నోటీసులు పంపినట్లు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. 

Updated : 09 May 2023 18:32 IST

కోల్‌కతా: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’(Kashmir Files) దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి లీగల్ నోటీసులు పంపించారు. తన సినిమాపై అవాస్తవ, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని, అందుకే ఆ నోటీసులు పంపించినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. దురుద్దేశంతో తమకు, తమ చిత్రానికి (కశ్మీర్‌ఫైల్స్‌) పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు గానూ సీఎం మమతా బెనర్జీకి నోటీసులు పంపినట్లు వివేక్ వెల్లడించారు. దానికి సంబంధించిన నోటీసులను ట్విటర్‌లో షేర్ చేశారు.

బెంగాల్‌లో ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనపై నిషేధం విధిస్తూ సోమవారం మమత నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ ఫైల్స్ ఒక వర్గాన్ని కించపర్చేలా తీశారు. ఇక కేరళ స్టోరీ.. వక్రీకరించిన కథ. కొద్దిరోజుల క్రితం భాజపా నిధులు పొందుతున్న కొందరు స్టార్లు బెంగాల్ వచ్చారు. వక్రీకరించిన, కల్పిత కథలతో వారు బెంగాల్ ఫైల్స్‌ను సిద్ధం చేస్తున్నారు’ అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె వ్యాఖ్యలపై పరువునష్టం కేసు పెడతానని అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు. తాజాగా వాటిని పంపినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు