Yasoda: ఇక యశోద సినిమాలో ఆ పేరు కనిపించదు..!
యశోద, ఇవా హస్పటల్ కోర్టు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈ విషయంపై నిర్మాత మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా ‘యశోద’. ఈ సినిమాలో సమంత నటనపై సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో ఇవా హస్పిటల్(EVA hospital) పేరు వాడటాన్ని వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వర్గాలు ఇటీవల కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసందే. దీంతో కోర్టు ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు యశోద ఓటీటీ విడుదల ఆపేయాలని ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. సినిమా మేకర్స్ ఇక పై ఇవా పేరు చిత్రంలో కనపడదు అని చెప్పారు.
యశోద నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ..‘‘మేము చట్టప్రకారమే సమస్యను పరిష్కరించాం. ఈ సినిమాలో ఇవా అనే పేరును బ్లర్ చేస్తాం. ఈ పేరుతో ఆస్పత్రి ఉందని తెలీదు. ఇది పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగింది. ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు. ఈ విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత మేము సినిమాలో ఆస్పత్రి పేరును బ్లర్ చేసి, పేరు వినిపించే చోట మ్యూట్ చేశాం. అన్ని సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ విషయాన్ని పరిష్కరించడానికి వారం రోజులు సమయం అడిగాం. ఓటీటీలో యశోద సినిమా ప్రసారం అయ్యేటప్పుడు ఈ లోగోలు, పేరు ఉండవు. మూడు వారాల నుంచి ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా అలరిస్తోంది. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనే విషయం మేము వచ్చే నెలలో ప్రకటిస్తాం. ఈ వ్యవహరాన్ని పరిష్కరించేందుకు సహకరించిన ఇవా హస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు’’ అని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Ts-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!