Pushpa 2: పక్కా ప్రణాళికలతో...
ఆలస్యంగా పట్టాలెక్కినా ‘పుష్ప: ది రూల్’ విషయంలో చిత్రబృందం పక్కా ప్రణాళికల్నే రచించినట్టు తెలుస్తోంది.
ఆలస్యంగా పట్టాలెక్కినా ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) విషయంలో చిత్రబృందం పక్కా ప్రణాళికల్నే రచించినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నట్టు సమాచారం. తొలి భాగం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఆ స్పందనని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు రూపకర్తలు. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఈ నెల 8న రష్యాలో విడుదల కానుంది. అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న చిత్రబృందం ‘పుష్ప: ది రూల్’ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, రష్యాలోనూ విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచించినట్టు సమాచారం. అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: నా ప్రశ్నలకు ప్రధాని నుంచి సమాధానం రాలేదు: రాహుల్
-
General News
TSLPRB: దేహదారుఢ్య పరీక్షల్లో అనర్హులైన ఆ అభ్యర్థులకు మళ్లీ అవకాశం
-
Crime News
Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!
-
Politics News
MLC Kavitha: జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
-
General News
CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ