Mahaan: విక్రమ్‌ ‘మహాన్‌’ మేకింగ్‌ వీడియో చూశారా?

విక్రమ్‌ కథానాయకుడిగా కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహాన్‌’.

Published : 22 Feb 2022 16:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విక్రమ్‌ కథానాయకుడిగా కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహాన్‌’. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్‌, ఆయన తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ల నటన అలరించింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల చేసింది. విక్రమ్‌, ధ్రువ్‌ విక్రమ్, బాబీ సింహా, సిమ్రన్‌ తదితరులు తమ పాత్రల కోసం ఏవిధంగా కష్టపడ్డారో ఇందులో చూపించారు. ఆద్యంతం అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని