Malaika Arora: నాలుగేళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో?

ఛల్‌...ఛయ్యా..ఛయ్యా...’, ‘మున్నీ బద్నామ్‌’ ..ఇలాంటి పలు పాపులర్‌ ప్రత్యేక గీతాలతో ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్‌ అందం మలైకా అరోరా.

Updated : 12 Nov 2022 09:02 IST

‘ఛల్‌...ఛయ్యా..ఛయ్యా...’, ‘మున్నీ బద్నామ్‌’ ..ఇలాంటి పలు పాపులర్‌ ప్రత్యేక గీతాలతో ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్‌ అందం మలైకా అరోరా (Malaika Arora). ఆమె 2018లో వచ్చిన ‘పఠాకా’లోని ‘హల్లో..హల్లో..’ తర్వాత మళ్లీ తెరపై కనిపించ లేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఓ ఐటమ్‌ పాటతో అదరగొట్టబోతున్నట్లు సమాచారం. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యాన్‌ యాక్షన్‌ హీరో’. అనిరుధ్‌ అయ్యర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓ ప్రత్యేకగీతంలో ఆడిపాడిందట మలైకా. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఈ పాట సాగుతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మలైక త్వరలో డిజిటల్‌ బాట పట్టనుంది. ఓ ఓటీటీ వేదికలో ‘మూవింగ్‌ ఇన్‌ విత్‌ మలైకా’ అనే షో చేయబోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని