Malaika Arora: మాజీ భర్తపై ప్రశంసలు కురిపించిన మలైకా అరోరా..

ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తను విడాకులు తీసుకోడానికి గల కారణాన్ని చెప్పింది మలైకా అరోరా(Malaika Arora). 

Published : 08 Dec 2022 01:41 IST

హైదరాబాద్‌: మలైకా అరోరా (Malaika Arora) ఎప్పుడూ సోషల్‌మీడియాలో వినిపించే పేర్లలో ఈ పేరు ఒకటి. తన జీవితంలో జరిగే విషయాలను అభిమానులతో పంచుకుంటూ వారికి దగ్గరగా ఉంటుంది ఈ నటి. తాజాగా తన మాజీ భర్త అర్బజ్ ఖాన్‌తో విడాకుల గురించి చెప్పింది. మూవింగ్‌ ఇన్‌ విత్‌ మలైకా(Moving in with malaika) అనే కార్యక్రమం మొదటి ఎపిసోడ్‌లో... విడాకులు తీసుకోడానికి గల కారణాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. అర్బజ్ ఖాన్‌కు మొదట ప్రపోజ్‌ చేసింది తానేనని నటి వెల్లడించింది.

‘ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే అర్బజ్ ఖాన్‌కు ప్రపోజ్‌ చేసింది నేనే. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగాను. దానికి అర్బజ్ వెంటనే అంగీకరించారు. అయితే జీవితంలో భిన్నమైన అంశాలు కోరుకోవడం వల్లే మేము విడిపోయాం. ఆయన ఎంతో మంచి వ్యక్తి. నన్ను ఎంతో మార్చాడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆయనే. ఇటీవల నేను ప్రమాదానికి గురైతే ఆపరేషన్‌ ధియేటర్‌ నుంచి బయటకు వచ్చే సరికి తను నాకోసం వేచి ఉన్నాడు. ఇప్పటికీ తను నాపై అంత ప్రేమ చూపిస్తాడు’ అంటూ మాజీ భర్తపై ప్రశంసలు కురిపించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని