నా జీవితంలో ‘మాస్టర్‌’ ఓ మైలురాయి: మాళవిక

మాళవికా మోహనన్‌ తమిళ, మలయాళ సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌ సరసన ‘డి43’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నాయికగా నటిస్తోంది. ఆ మధ్య విజయ్‌తో కలిసి ‘మాస్టర్‌’ చిత్రంలో అలరించింది.

Published : 22 May 2021 21:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మాళవికా మోహనన్‌ తమిళ, మలయాళ సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌ సరసన ‘డి43’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నాయికగా నటిస్తోంది. ఆ మధ్య విజయ్‌తో కలిసి ‘మాస్టర్‌’ చిత్రంలో అలరించింది. ఈ సినిమా గురించి స్పందిస్తూ..‘‘హీరో విజయ్‌, సేతుపతిలతో కలిసి ‘మాస్టర్‌’లో నటించడం నా జీవితంలో గొప్ప మైలురాయి. విజయ్‌తో తొలిసారిగా పనిచేయడం చాలా థ్రిల్లింగ్‌ అనిపించింది. ఓ గొప్ప టీమ్‌తో కలిసి నటించడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. సినిమా కోసం దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌, సంగీత స్వరకర్త అనిరుధ్‌ రవిచందర్‌.. మేమంతా కలిసి ఉంటూ.. చాలాకాలం పనిచేశాం. బ్లాక్ బస్టర్ ‘మాస్టర్‌’లో నేనొక భాగం కావడం నా అదృష్టం. భవిష్యత్తులో వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’’ అని తెలిపింది. ప్రస్తుతం ఆమె హిందీలో ‘యుధ్రా’ అనే చిత్రంలో నాయికగా నటిస్తోంది. ‘గల్లీ బాయ్’ నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది కథానాయకుడు. మాళవిక హిందీలో తొలిసారిగా మాజిద్ మజిది దర్శకత్వం వహించిన ‘బియాండ్‌ ది క్లౌడ్స్’లో కథానాయికగా నటించింది. బుల్లితెరపై వచ్చిన ‘మసాబా మసాబా’ అనే ధారావాహికలో ప్రత్యేక పాత్రలో నటించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని