Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్‌

హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

Published : 04 Oct 2023 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ ‘మాస్టర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళ నటి మాళవికా మోహనన్‌ (Malavika Mohanan). సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా అభిమానులను పలకరించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా విడుదల గురించి అడగ్గా ‘దర్శకుడిని అడగండి’ అని చెప్పింది. ఆ చిట్‌చాట్‌లోని కొన్ని సంగతులివీ..

* ప్రభాస్‌ ‘సలార్‌’, షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’.. ఏ సినిమాని చూడాలనుకుంటున్నారు?

మాళవిక: రెండూ చూడాలని ఉంది. ఏదో ఒక్కటే ఎంపిక చేసుకోమంటే నా ఆన్సర్‌ ‘సలార్‌’. ఆ సినిమా టీజర్‌ నాకు బాగా నచ్చింది.

* మీకు బాగా ఇష్టమైన వంటకాలు?

మాళవిక: మా అమ్మ చేసే ఫిష్‌ ఫ్రై, ఫిష్‌ కర్రీ.

* మీరు నటించిన పాత్రల్లో సవాలు విసిరిందేది?

మాళవిక: ‘తంగలాన్‌’ సినిమాలో పోషించిన పాత్ర. అది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా.

* ‘తంగలాన్‌’ ఎప్పుడు విడుదలవుతుంది?

మాళవిక: ఇది నన్ను కాదు దర్శకుడు పా. రంజిత్‌ని అడగాల్సిన ప్రశ్న.

* మీ ఫేవరెట్‌ యాక్టర్‌?

మాళవిక: ఫాహద్‌ ఫాజిల్‌.

* మీ డ్రీమ్‌ రోల్‌?

మాళవిక: పీరియాడికల్‌ మూవీలో రాజకుమారిగా, రాణిగా నటించాలనుంది.

* హీరో అజిత్‌ గురించి చెప్పండి..

మాళవిక: బైక్స్‌ను ఇష్టపడే ఎవరినైనా నేనూ ఇష్టపడతా.

* ‘మాస్టర్‌’కాకుండా విజయ్‌ నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైంది?

మాళవిక: తేరి.

విక్రమ్‌ హీరోగా పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘తంగలాన్‌’ (Thangalaan). మాళవికా హీరోయిన్‌గా నటించింది. జులైలో చిత్రీకరణ పూర్తయింది. కర్ణాటకలోని కోలార్‌ బంగారు గని కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ, విదేశీ భాషల్లో 2డీ, 3డీ ఫార్మట్లతో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని