RC15: చరణ్‌ చిత్రం కోసం?

ఈ యేడాది ఖరారైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రామ్‌చరణ్‌ - శంకర్‌ సినిమా ఒకటి. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్న ఈ సినిమా గురించి తరచూ...

Published : 05 Jun 2021 09:12 IST

హైదరాబాద్‌: ఈ యేడాది ఖరారైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రామ్‌చరణ్‌ - శంకర్‌ సినిమా ఒకటి. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్న ఈ సినిమా గురించి తరచూ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం చరణ్‌కి జోడీగా నటించనున్న కథానాయిక ఎంపికపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న మొదలుకొని పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మాళవిక మోహనన్‌ పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రంతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది. మరి శంకర్‌ ఈమెకే ఓటేస్తాడా? లేక మరో భామని పరిశీలిస్తారా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని