Malavika Mohanan: నేను పవన్‌కల్యాణ్ సినిమాలో నటించడం లేదు: మాళవిక మోహనన్
Malavika Mohanan: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటి మాళవిక మోహనన్ స్పష్టతనిచ్చారు.
ఇంటర్నెట్‌డెస్క్: స్టార్ కథానాయకుల సినిమాలు ప్రకటించగానే హీరోయిన్ ఎవరంటూ అభిమానులు తెగ వెతికేస్తుంటారు. ఈ క్రమంలో పలువురి పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతాయి. తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న కథానాయిక మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఇలాగే వార్తల్లో నిలిచింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ (Pawan kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో కథానాయికగా మాళవిక నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అదీ కూడా సెకండ్ హీరోయిన్‌గా చేస్తున్నారని ఆ వార్తల సారాంశం. తాజాగా ఆ వార్తలపై మాళవిక స్పందించారు.
‘పవన్‌కల్యాణ్ సర్ అంటే ఎంతో ఆరాధన భావం ఉంది. కానీ, నేను ఆయన ప్రాజెక్టులో నటించడం లేదు. ప్రస్తుతం ఒక అద్భుతమైన తెలుగు చిత్రంలో చేస్తున్నా. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా మాత్రం కాదు. మెయిల్‌లీడ్ రోల్. ఇదే తెలుగులో నా తొలి చిత్రం. ఈ మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా’ అని సమాధానం ఇచ్చారు. మాళవిక ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఓ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. ‘రాజా డీలక్స్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పై ఉంది. మరోవైపు మలయాళంలో ఆమె నటించిన ‘క్రీస్టీ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటితో పాటు, ‘తంగలాన్’, ‘యుద్ర’ (హిందీ) సినిమాల్లో నటిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
-
Crime News
Vizag: విశాఖ జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి
-
Ap-top-news News
Andhra News: ఈ-ఆటోల తరలింపు ఎలా?.. తల పట్టుకున్న అధికారులు
-
Crime News
Vizag: విశాఖ రైల్వే స్టేషన్లో 18 నెలల చిన్నారి కిడ్నాప్
-
Politics News
TDP: లోకేశ్‌కు చిన్న హాని జరిగినా జగన్‌దే బాధ్యత